ఇంటి ముందు పని చేసుకుంటున్న మహిళ పాముకాటుకు గురై మృతిచెందింది.
సీకేపల్లి (అనంతపురం) : ఇంటి ముందు పని చేసుకుంటున్న మహిళ పాముకాటుకు గురై మృతిచెందింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా సీకేపల్లి మండలం మేడాపురం పంచాయతీ పరిధిలోని చిన్నమొగలాయపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నాగమ్మ(48) ఇంటి ముందు చెట్లు తొలగిస్తుండగా.. పాము కాటేసింది. ఇది గుర్తించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందిందని వైద్యులు తెలిపారు.