వేగంగా వెళ్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తా కొట్టిన ప్రమాదంలో మహిళ మృతిచెందింది.
వరంగల్ : వేగంగా వెళ్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తా కొట్టిన ప్రమాదంలో మహిళ మృతిచెందింది. ఈ సంఘటన వరంగల్‌లోని చింతల్ బ్రిడ్జ్ సమీపంలో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా నివాసముంటున్న సరోజన(40) రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వస్తున్న బైక్ అదుపుతప్పి ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు గాయపడినవారిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.