డబ్బుల కోసం తొక్కిసలాట.. ఒకరి మృతి
కేంద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన తర్వాత ఇంతవరకు క్యూలో నిలబడి గుండెపోటుతో మరణించినవారి విషయాలు తెలిశాయి. కానీ, ఉత్తరప్రదేశ్‌లో డబ్బుల కోసం తొక్కిసలాట జరిగి అందులో ఒక వ్యక్తి మరణించాడు. దేవరియా అనే ప్రాంతంలో గల స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచి వద్ద పాత నోట్లు మార్చుకోడానికి, కొత్త నోట్లు డ్రా చేసుకోడానికి భారీగా క్యూ ఏర్పడింది.
సాయంత్రం బ్యాంకు మూసేసే సమయం ఆసన్నం అవుతున్నా క్యూ లైను ఏమాత్రం తగ్గలేదు. దాంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. అందులో ఒక వ్యక్తి మరణించారు. మరణించిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. అలాగే, ఈ ఘటనలో ఎంతమంది గాయపడిందీ కూడా ఇంకా తెలియాల్సి ఉంది.