బైక్ నడపడం నేర్చుకుంటూ.. | Man dies in freak accident | Sakshi
Sakshi News home page

బైక్ నడపడం నేర్చుకుంటూ..

Published Fri, Nov 27 2015 4:43 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

Man dies in freak accident

కళ్యాణదుర్గం (అనంతపురం) : బైక్ నడపడం నేర్చుకుంటున్న ఓ యువకుడు ప్రమాదవశాత్తు రోడ్డు పక్కన ఉన్న బండరాళ్లను ఢీకొని మృతిచెందాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మండ్లాపురం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన హన్మంత్ రాయుడు(22) కొత్తగా ద్విచక్రవాహనం నడపడం నేర్చుకుంటున్నాడు. ఈ క్రమంలో గ్రామ శివారులో బైక్ నడుపుతుండగా.. రోడ్డు పక్కన ఉన్న బండరాళ్లకు ఢీకొన్నాడు. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయాలైన హన్మంత్ రాయుడు అక్కడికక్కడే మృతిచెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement