రోడ్డు ప్రమాదంలో నరడ్ల నరసింహారెడ్డి(33) అనే సింగరేణి కార్మికుడు మృతిచెందాడు.
జైపూర్ (ఆదిలాబాద్ జిల్లా) : రోడ్డు ప్రమాదంలో నరడ్ల నరసింహారెడ్డి(33) అనే సింగరేణి కార్మికుడు మృతిచెందాడు. ఈ సంఘటన జైపూర్ మండలం ఇందారం బస్టాండు వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. స్కూటీపై గోదావరిఖని వెళ్తుండగా అదుపు తప్పి ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టాడు. ఈ ఘటనలో తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.