అదుపుతప్పి ఓ ట్రాక్టర్ వ్యవసాయ బావిలోకి దూసుకుపోయింది.
కథలాపూర్: అదుపుతప్పి ఓ ట్రాక్టర్ వ్యవసాయ బావిలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా కథలాపూర్ శివారులో సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. డ్రైవర్ పక్కన కూర్చోగా, మహారాష్ట్రకు చెందిన కూలీ ట్రాక్టర్‌ను నడపడం వల్లే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఇంజన్ భాగం బావిలో బోల్తా కొట్టి ఇరుక్కుపోవడంతో దాన్ని నడుపుతున్న కూలీ నీళ్లలో మునిగిపోయాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్టర్ ఇంజన్‌ను బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు.