యు-విన్, మిషన్ మౌసమ్ పథకాలపై రాష్ట్రపతి ప్రసంగం
కేంద్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ప్రసంగంలో వ్యవసాయ ఉత్పత్తులకు న్యాయమైన ధరలను నిర్ధారించడానికి, రైతుల ఆదాయాన్ని పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని నొక్కి చెప్పారు. పౌరుల జీవితాలను మెరుగుపరచడానికి, వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులకు సేవలందించేందుకు ఉద్దేశించిన అనేక కీలక కార్యక్రమాలను ఆమె హైలైట్ చేశారు.
రైతులపై దృష్టి
రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించేలా చూడటం ద్వారా వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముర్ము తెలిపారు. వ్యవసాయ రంగానికి ఊతమివ్వడం, రైతుల ఆదాయాన్ని పెంచడం, తద్వారా దేశ సమగ్ర ఆర్థిక వృద్ధికి దోహదపడటం ఈ కార్యక్రమం లక్ష్యమని చెప్పారు.
యు-విన్ పోర్టల్
గర్భిణులు, చిన్నారులకు ఆరోగ్య సంరక్షణను మెరుగుపరిచే దిశగా యూ-విన్ పోర్టల్‌ను ప్రారంభించినట్లు రాష్ట్రపతి ప్రకటించారు. యు-విన్ పోర్టల్ వ్యాక్సినేషన్ షెడ్యూల్‌ను కచ్చితంగా ట్రాక్ చేయడానికి, సకాలంలో పూర్తి రోగనిరోధక శక్తిని నిర్ధారించడానికి రూపొందించినట్లు తెలిపారు. యూనివర్సల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌లో భాగంగా 12 నివారించదగిన వ్యాధులకు వ్యాక్సిన్ అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు.
ఇదీ చదవండి: ఆరు కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య బీమా
మిషన్ మౌసమ్
భారతదేశాన్ని వాతావరణ మార్పులకు సిద్ధంగా ఉండేలా, వాటివల్ల కలిగే ప్రభావాలను మరింత స్మార్ట్‌గా నిర్వహించడానికి మిషన్ మౌసమ్ పథకం తోడ్పడుతుందన్నారు. ఈ రూ.2,000 కోట్ల ప్రాజెక్టు ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ నేతృత్వంలో కచ్చితమైన, సకాలంలో వాతావరణ సమాచారాన్ని అందించడానికి ఉపయోగపడుతుంది. మిషన్ మౌసమ్‌లో తదుపరి తరం రాడార్లు, ఉపగ్రహ వ్యవస్థలు, అధిక పనితీరు కలిగిన సూపర్ కంప్యూటర్లతో సహా అధునాతన సాంకేతికతలను ఉపయోగిస్తారని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment