వినుకొండ (గుంటూరు జిల్లా) : గుంటూరు జిల్లా న్యూజెండ్ల మండలం చింతలచెరువు గ్రామం వద్ద మంగళవారం సాయంత్రం 6 గంటలకు జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి చెందారు. చింతలచెరువు గ్రామానికి చెందిన బొమ్మా శ్రీనివాసరావు(35), రవి మోటార్‌బైక్‌పై వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొంది.
ఈ ప్రమాదంలో బొమ్మా శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన రవిని వినుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరు ఐనవోలుకు వచ్చి వ్యవసాయ పనులు ముగించుకుని చింతలచెరువుకు తిరిగి వెళుతుండగా పోలేరమ్మ ఆలయం వద్ద ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి
Published Tue, Sep 29 2015 6:23 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement