కాబూల్ ఎయిర్పోర్టు వద్ద భారీ పేలుడు | Car bomb explodes close to airport in Afghan capital | Sakshi
Sakshi News home page

కాబూల్ ఎయిర్పోర్టు వద్ద భారీ పేలుడు

Published Sun, May 17 2015 11:56 AM | Last Updated on Tue, Aug 14 2018 3:22 PM

Car bomb explodes close to airport in Afghan capital

ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయం ఆదివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. నాటో దళాలే లక్ష్యంగా వారి కన్వాయ్ లోకి పేలుడు పదార్థాలతో నింపిన టొయోటా ఇన్నోవాతో దూసుకెళ్లిన ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి జరిపారు. ఈ ఘటనలో పలువురు విదేశీయులు గాయపడినట్లు తెలిసింది.

భారీగా ప్రాణనష్టం కూడా జరిగి ఉంటుందనే వార్తలు వెలువడుతున్నప్పటికీ ఇప్పుడే ఏమీ చెప్పలేమని కాబూల్ పోలీసు శాఖ అధికార ప్రతినిధి ఇబాదుల్లా కరీమీ అన్నారు. ఘటనా స్థలికి చేరుకొని  క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నామన్నారు. యుద్ధం జరిగిన పన్నెండేళ్ల తరువాత ఆఫ్ఘన్ నుంచి అమెరికా, నాటో దళాలు వెనక్కి తిరిగివెళుతున్న నేపథ్యంలో వారిపై  ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. ఆ క్రమంలోనే ఆదివారం నాటి దాడి జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement