అఫ్గానిస్తాన్: అఫ్గాన్ రాజధాని కాబూల్ ఎయిర్‌స్పేస్ మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో కాబూల్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఎలాంటి విమాన రాకపోకలకు అవకాశం లేకుండా పోయింది. అయితే అఫ్గాన్‌లో మిగిలిపోయిన భారత పౌరులను తీసుకురావడానికి సోమవారం మధ్యాహ్నం ఎయిరిండియా విమానాలు అక్కడికి వెళ్లాల్సి ఉంది. కానీ ఎయిర్‌స్పేస్ మూసివేయడంతో ఎయిరిండియా సర్వీసులు నిలిచిపోయాయి. అఫ్గాన్ మీదుగా విమానాల రాకపోకలపై నిషేధం విధించడంతో కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. అధికారం తాలిబన్ల వశం కావడంతో దేశం విడిచి వెళ్తున్నారు.
అంతేకాదు అఫ్గాన్ మీదుగా అమెరికా నుంచి భారత్‌కు వచ్చే పలు ఎయిరిండియా విమానాలను దారి మళ్లిస్తున్నారు. షికాగో-ఢిల్లీ, శాన్‌ఫ్రాన్సిస్కో- ఢిల్లీ విమానాలను గల్ఫ్ దేశాలకు తరలిస్తున్నారు. అఫ్గానిస్తాన్ మీదుగా ప్రయాణించే అన్ని విమానాలను దారి మళ్లిస్తుండటంతో అక్కడి ఇతర దేశాల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కాబూల్ ఎయిర్‌పోర్టులో రద్దీని తగ్గించేందుకే విమానాలు నిలిపివేశామని అధికారులు పేర్కొన్నారు.
కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో కాల్పులు
ఆర్మీ విమానాల్లో ఎక్కుతున్న అఫ్గాన్‌లను యూఎస్ బలగాలు అడ్డుకున్నాయి. ఎలాగైనా సరే దేశం వదిలి వెళ్లిపోవాలన్న ఉద్దేశంతో కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లోని విమానాల్లోకి ఎక్కడానికి జనాలు ఎగబడుతున్నారు. దీంతో అక్కడే ఉన్న అమెరికా దళాలు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. దీంతో పౌరులు భయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో ఏర్పడిన తొక్కిసలాటలో అయిదుగురు మృతి చెందారు.
After the Taliban swept #Kabul, residents are desperate to flee #Afghanistan. Watch the chaos at the Kabul airport. pic.twitter.com/WbxK1wzHdM
— WION (@WIONews) August 16, 2021
Comments
Please login to add a commentAdd a comment