ఫోటో క్రెడిట్: ది న్యూయార్క్ టైమ్స్
కాబూల్: అఫ్గన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న తరువాత దేశంలో నిరసనల సెగ ప్రారంభమైంది. తాజాగా కాబూల్ విమానాశ్రయం వెలుపల గందరగోళం చెలరేగింది. దేశం నుండి పారిపోవడానికి వేలాది మంది ప్రజలు విమానాశ్రయానికి తరలివచ్చారు. వీరిపై తాలిబన్లు విరుచుకుపడ్డారు. రైఫిళ్లతోవారినిచితక బాదారు. తాలిబన్ల దాడి,భారీగా ఏర్పాటు చేసిన ముళ్ల కంచె, జనం హాహాకారాలతో ప్రతిధ్వనిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Afghanistan: తాలిబన్లకు మరో షాక్! సాయం నిలిపివేత)
విమానాశ్రయం లోపల యుఎస్ మిలిటరీ నియంత్రణ ఏర్పాటు చేసినప్పటికీ, సైనిక విమానాలు తిరిగి ప్రారంభమైనప్పటికీ బుధవారం పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. వెల్లువలా వస్తున్న జనాలను అదుపు చేసేందుకు తాలిబ్లను విరుచుకుపడుతున్నారు. కాబుల్ విమానాశ్రయం వెలుపల గొలుసులు, కొరడాలు, ఇతర పదునైన ఆయుధాలతో ప్రజలను తీవ్రంగా కొడుతున్నారని సోషల్ మీడియా హోరెత్తి పోతోంది. ఈ ఘటనలో ఒక మహిళ, బాలుడు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. దీంతో ప్రజలు సహాయం కోసం అర్థిస్తూ హాహాకారాలు చేస్తున్నారు. మమ్మల్ని పోనివ్వండి.. లేదంటే తాలిబన్లు మా తలలు నరుకుతారు..గేట్లు తీయమంటూ వేడుకుంటున్నవీడియో వైరల్ అవుతోంది అమెరికాలో అత్యంత హృదయం లేని, భయంకరమైన మనిషి జోబైడెన్ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. విమానాశ్రయ గేట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 17 మంది గాయపడ్డారని విమానాశ్రయంలోని నాటో సెక్యూరిటీ అధికారిని ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది. (Ashraf Ghani: భారీ నగదుతో పారిపోయాడు: రష్యా)
At #kabulairport gates where the US forces controlling, people crying and begging US forces to allow them to pass the gates otherwise the Taliban will come and will behead them. pic.twitter.com/wzxXJf2ngL
— Natiq Malikzada (@natiqmalikzada) August 18, 2021
Scenes of total chaos at #kabulairport today. pic.twitter.com/A2ESgEfxNW
— Matt Zeller (@mattczeller) August 18, 2021
Comments
Please login to add a commentAdd a comment