ఇస్లామాబాద్: ఇరాన్ క్షిపణి దాడులకు వ్యతిరేకంగా పాకిస్థాన్ ప్రతీకార చర్యకు పూనుకుంది. పాకిస్థాన్ కూడా ఇరాన్ వైమానిక దాడులతో రెచ్చిపోయింది. ఇరాన్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు ప్రారంభించినట్లు పాక్ వర్గాలు తెలిపాయి. ఈ దాడుల్లో నలుగురు పిల్లలతోపాటు ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్ ప్రాంతంలోని బలూచిస్థాన్‌లో ఇరాన్ బుధవారం క్షిపణి దాడులు చేసిన విషయం తెలిసిందే. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని జైష్ ఉల్-అదిల్ టెర్రర్ గ్రూప్ స్థావరాలపై ఇరాన్ దాడి చేసింది.
బలూచిస్థాన్‌లో ఇరాన్ బుధవారం జరిపిన దాడుల్లో ఇద్దరు పిల్లలు మృతి చెందారు. మరో ముగ్గురు బాలికలు తీవ్రంగా గాయపడ్డారు. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని జైష్ ఉల్-అదిల్ టెర్రర్ గ్రూప్ రెండు స్థావరాలను డ్రోన్లు, క్షిపణులతో ధ్వంసం చేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నివేదించింది. పాక్ సరిహద్దు వెంట తమ బలగాలపై దాడులు చేసిన ఉగ్రవాద గ్రూప్‌లను లక్ష‍్యంగా చేసుకుని దాడులు చేసినట్లు వెల్లడించింది.
Sources in the Pakistani Armed Forces are reporting that the Air Force has conducted several Airstrike tonight on a Baloch Militant Group in Eastern Iran near the City of Saravan, roughly 20 Miles into the Sistan and Baluchestan Provence from the Border with Pakistan; Smoke is… pic.twitter.com/VKO8fjohWD
— OSINTdefender (@sentdefender) January 18, 2024
ఇరాన్ దాడుల్ని పాక్ తీవ్రంగా ఖండించింది. తమ గగనతలంలో ఇరాన్ చేపట్టిన ఈ చర్యను పాక్ ఖండించింది. తమ సార్వభౌమాధికారాన్ని ధిక్కరించడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని హెచ్చరించింది. తమ రాయబారిని వెనక్కి పిలిపించింది. ఇరాన్ రాయబారిపై వేటు వేసింది. తీవ్ర పరిణామాలు ఉంటాయని ఘాటుగా స్పందించింది.
ఇదీ చదవండి: పాక్ ఉగ్రస్థావరాలపై ఇరాన్ దాడులు
Comments
Please login to add a commentAdd a comment