వాషింగ్టన్ డీసీ : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేసేందుకు కుట్ర జరిగింది. అయితే ఈ కుట్రను ఎఫ్‌బీఐ అధికారులు భగ్నం చేశారు. కొన్నాళ్లు ఇరాన్‌లో ఉండి ఇటీవలే అమెరికాకు వచ్చిన పాకిస్థాన్ జాతీయుడు అసిఫ్ మర్చంట్ డొనాల్డ్ ట్రంప్, మరో వీఐపీని హత మార్చేందుకు ప్రయత్నించాడు.
ఈ క‍్రమంలో తాము షూటర్లమేనంటూ ఎఫ్‌బీఐ అధికారులు అసిఫ్ మర్చంట్‌ను నమ్మించారు. ఆపై అదుపులోకి తీసుకున్నారు. అయితే అసిఫ్‌కు ట్రంప్‌పై కొద్దిరోజుల క్రితం జరిపిన కాల్పులకు ఎలాంటి సంబంధం లేదని అమెరికా మీడియా తెలిపింది.
సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీని తర్వాత ఇరాన్‌లో అత్యంత శక్తిమంతమైన వ్యక్తిగా పరిగణించే జనరల్ ఖాసిమ్ సులేమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు అసిఫ్ మర్చంట్ ట్రంప్‌పై కుట్రకు యత్నించినట్లు సమాచారం.
ఖాసిమ్ సులేమానీ ఎవరు?
బాగ్దాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో శుక్రవారం(జనవరి-3,2020) కారులో వెళ్తున్న సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీని తర్వాత ఇరాన్‌లో అత్యంత శక్తిమంతమైన వ్యక్తిగా జనరల్ ఖాసిమ్ సులేమానీని పరిగణించే ఇరానియన్ మిలటరీ కమాండర్ ఖాసిమ్ సొలేమానీపై అమెరికా దళాలు వైమానిక దాడి జరిపి హతమార్చాయి.
అయితే సులేమానీని యూఎస్ దళాలు హతమార్చే కొద్దిసేపటి ముందు ఏం జరిగింది,డ్రోన్ ఆపరేషన్‌లో సులేమానీ ఎలా మృతి చెందిందీ అనే విషయాలను ట్రంప్ బహిర్గతం చేశారు. నాటి నుంచి ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని ఇరాన్ భావిస్తోంది. తాజాగా, ట్రంప్‌ను హతమార్చేందుకు ఇరాన్.. అసిఫ్ మర్చంట్‌ను అమెరికా పంపినట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment