పాకిస్తాన్‌లోని జైష అల్ అదిల్ మిలిటెంట్లు లక్ష్యంగా ఇరాన్ జరిపిన మెరుపు వైమానిక దాడులకు గురువారం పాకిస్తాన్ కూడా ప్రతికార దాడులు చేసిన విషయం తెలిసిందే. అయితే పాక్ ప్రతీకార వైమానిక దాడులకు ముందు అగ్రరాజ్యాన్ని సంప్రదించిందా? అని మీడియో అడిగిన ప్రశ్నను అమెరికా దాటవేసింది. మీడియా ప్రశ్నకు అమెరికా స్టేట్ డిపార్టుమెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ సమాదానాన్ని నిరాకరించారు. ఈ వ్యవహారంలో ఏం జరగవచ్చో లేదా జరగకపోవచ్చో అనేదానిపై తాను ప్రస్తుతానికి ఏం మాట్లాడలేనని స్పష్టం చేశారు.
అమెరికా ఎల్లప్పుడూ మధ్యప్రాచ్య ప్రాంతంలో శాంతి, భద్రతతో కూడిన పరిస్థితులు నెలకొనాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అందుకోసమే అక్టోబర్ 7 నుంచి ఇజ్రాయెల్-హమాస్ మధ్య దౌత్యపరమైన శాంతి కోసం యత్నిస్తున్నామని తెలిపారు. ఇక.. అక్టోబర్ 7 తర్వాత ఇజ్రాయెల్-గాజా దాడులు కోనసాగుతున్నాయి. అప్పటి నుంచి యెమెన్‌లో పనిచేసే హౌతీ రెబల్స్ ఎర్ర సముద్రంలోని ఇజ్రాయెల్, ఇతర దేశాలకు సంబంధించిన పలు వాణిజ్య నౌకలపై దాడులకు తెగపడినట్లు తెలిపారు. దీంతో అమెరికా, బ్రిటన్ బలగాలు.. హౌతీ రెబల్స్‌పై ఎదురుదాడి చేశాయని అన్నారు.
అనంతరం ఇరాన్, పాకిస్తాన్ పరస్పరం దాడులు చేసుకున్నాయని తెలిపారు. మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరగటంపై తాము ఆందోళన చెందుతున్నామని అన్నారు. ఈ ఉద్రిక్తతలపై తాము దృష్టి సారించామని పేర్కొన్నారు. అక్టోబర్ 7నుంచి ఉధృతం అవువతున్న దాడుల పట్ల ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. ఇరాన్-పాక్తిస్తాన్ ఉద్రిత్తలపై మాట్లాడుతూ.. మధ్యప్రాచ్యంలో తీవ్రవాదానికి నిధలు సమకూర్చటం వంటి సుదీర్ఘ చరిత్ర ఇరాన్‌కు కలిగి ఉన్నట్లు తెలిపారు.
చదవండి: మైనారిటీ నేతకు మద్దతు.. రష్యాలో పెద్ద ఎత్తున ఆందోళనలు
Comments
Please login to add a commentAdd a comment