పాకిస్థాన్: కరాచి జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుపై ఉగ్రవాదుల దాడి చేసిన ఘటనలో 11 మంది మృతి చెందారు. ఆదివారం రాత్రి పాత విమానాశ్రయం భవనాన్ని చుట్టుముట్టిన ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఎయిర్ భద్రతా సిబ్బంది(ఏఎస్ఎఫ్) వేషాల్లో వచ్చిన 10 మంది తీవ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్టు అధికారులు తెలిపారు.
అయితే ఏ విమానాన్ని ధ్వంసం చేయలేదని వెల్లడించారు. ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఏడుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. భద్రతా సిబ్బంది జరిపిన ఎదురు కాల్పుల్లో నలుగురు తీవ్రవాదులు మృతి చెందారు.
కరాచి ఎయిర్‌పోర్టుపై ఉగ్రవాదుల దాడి
Published Mon, Jun 9 2014 8:12 AM | Last Updated on Sat, Sep 2 2017 8:33 AM
Advertisement