శ్రీనగర్: జమ్ము, కశ్మీర్ పుల్వామా జిల్లాలోని ఆర్మీ క్యాంప్లో శనివారం పేలుడు సంభవించింది. ప్రమాదవశాత్తు జరిగిన ఈ పేలుడులో 12 మంది జవాన్లు గాయపడ్డారు. వీరిలో ఏడుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. దక్షిణ కశ్మీర్లోని అవంతిపురా ఏరియాలోని పుల్వామాలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఈ పేలుడు సంభవించినట్టుగా ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. కాగా పేలుడుకు గల కారణాలు చెప్పలేమని, విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు.
కశ్మీర్లో పేలుడు: 12మంది జవాన్లకు గాయాలు
Published Sat, Aug 29 2015 11:34 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement