స్టీల్‌ ప్లాంట్‌లో పేలుడు.. 12 మంది మృతి | 12 Dead and One Injured in Explosion at Steel Plant in Mexico | Sakshi

స్టీల్‌ ప్లాంట్‌లో పేలుడు.. 12 మంది మృతి

Oct 31 2024 11:26 AM | Updated on Oct 31 2024 11:31 AM

12 Dead and One Injured in Explosion at Steel Plant in Mexico

మెక్సికో సిటీ: మెక్సికోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి స్టీల్ ప్లాంట్‌లో జరిగిన పేలుడులో 12 మంది మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు. స్థానిక అధికారులు ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను మీడియాకు అందించారు.

మెక్సికో నగరానికి తూర్పున 140 కిలోమీటర్ల దూరంలోని అక్లోజ్‌టోక్‌లో ఈ పేలుడు సంభవించినట్లు త్లాక్స్‌కాలా స్టేట్ సివిల్ ప్రొటెక్షన్ తెలిపింది. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. కార్మికుల నుండి వచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం కరిగిన ఉక్కు.. నీటి పరిధిలోకి రావడంతో పేలుడు సంభవించి, మంటలు చెలరేగాయి. బాధిత కుటుంబాలను త్లాక్స్‌కలా గవర్నర్ లోరెనా క్యూల్లార్  పరామర్శించారు.  ఈ ఉదంతం దర్యాప్తు పూర్తయ్యేంతవరకూ ప్లాంట్‌ను మూసివేయనున్నారని సమాచారం. 

ఇది కూడా చదవండి: కలలో ఏనుగు కనిపిస్తే..? ఏమవుతుంది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement