టర్కీలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి | Massive Explosion in Western Turkiye | Sakshi
Sakshi News home page

టర్కీలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

Published Mon, Jul 1 2024 9:38 AM | Last Updated on Mon, Jul 1 2024 11:24 AM

Massive Explosion in Western Turkiye

ఇస్తాంబుల్‌: టర్కీలో సంభవించిన భారీ పేలుడుకు ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో మరో 63 మంది గాయపడ్డారు. బాధితులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. గాయపడినవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.

మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఘటన టర్కీకి పశ్చిమాన ఉన్న ఇజ్మీర్‌లో చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలోని ఒక రెస్టారెంట్‌కు సంబంధించిన టాంకులో పేలుడు సంభవించింది. అక్కడి సీసీటీవీ కెమెరాలో ఘటన అంతా రికార్డయ్యింది. ఒక్కసారిగా భారీగా పేలుడు శబ్ధం వినిపించడంతో స్థానికులంతా వణికిపోయారు. ఆ రహదారి గుండా వెళుతున్నవారు ప్రమాదం బారినపడ్డారు. టర్కీ హోమ్‌శాఖ మంత్రి అలీ ఎర్లికాయ్‌ సోషల్‌ మీడియాలో స్పందిస్తూ తాము ఘటన జరిగిన స్థలానికి రెస్క్యూ బృందాన్ని పంపినట్లు తెలిపారు.  

బాధితులు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి ఇజ్మీర్‌ గవర్నర్‌ వెళ్లి వారిని పరామర్శించారు. ఈ ఘటనలో స్వల్పంగా గాయపడిన 40 మందికి చికిత్స అందించిన అనంతరం డిశ్చార్జ్‌ చేశారు. మిగిలిన బాధితులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అనుమానంతో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement