Turkey blast
-
టర్కీలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి
ఇస్తాంబుల్: టర్కీలో సంభవించిన భారీ పేలుడుకు ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో మరో 63 మంది గాయపడ్డారు. బాధితులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. గాయపడినవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఘటన టర్కీకి పశ్చిమాన ఉన్న ఇజ్మీర్‌లో చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలోని ఒక రెస్టారెంట్‌కు సంబంధించిన టాంకులో పేలుడు సంభవించింది. అక్కడి సీసీటీవీ కెమెరాలో ఘటన అంతా రికార్డయ్యింది. ఒక్కసారిగా భారీగా పేలుడు శబ్ధం వినిపించడంతో స్థానికులంతా వణికిపోయారు. ఆ రహదారి గుండా వెళుతున్నవారు ప్రమాదం బారినపడ్డారు. టర్కీ హోమ్‌శాఖ మంత్రి అలీ ఎర్లికాయ్ సోషల్ మీడియాలో స్పందిస్తూ తాము ఘటన జరిగిన స్థలానికి రెస్క్యూ బృందాన్ని పంపినట్లు తెలిపారు. బాధితులు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి ఇజ్మీర్ గవర్నర్ వెళ్లి వారిని పరామర్శించారు. ఈ ఘటనలో స్వల్పంగా గాయపడిన 40 మందికి చికిత్స అందించిన అనంతరం డిశ్చార్జ్ చేశారు. మిగిలిన బాధితులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అనుమానంతో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. -
తుర్కియే పార్లమెంట్ భవనం ఎదుట ఆత్మాహుతి దాడి
అంకారా: పాకిస్తాన్లో జరిగిన ఆత్మాహుతి దాడి మిగిల్చిన విషాదాన్ని మరువక ముందే తుర్కియేలో ఉగ్రావాదులు పంజా విసిరారు. తుర్కియే పార్లమెంట్ భవనం ఎదుట ఆదివారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు పోలీసు అధికారులు గాయపడినట్లు తెలిపింది తుర్కియే అంతర్గత వ్యవహారాల శాఖ. ప్రభుత్వం ఇది తీవ్రవాదుల పనేనని ప్రకటించింది. ఆదివారం ఉదయం 9.30 ప్రాంతంలో ఇద్దరు తీవ్రవాదులు ఒక కమర్షియల్ వాహనంలో తుర్కీయే పార్లమెంట్ భవనం వద్దకు వచ్చారు. డైరెక్టరేట్ జనరల్ భద్రతా విభాగం ఎంట్రన్స్ గేట్ వద్దకు రాగానే వీరిద్దరూ బాంబులతో దాడి చేశారనన్నారు. వారిలో ఒకరు ఆత్మాహుతికి పాల్పడగా మరొక తీవ్రవాది బాంబును నిర్వీర్యం చేశామని తెలిపింది అంతర్గత వ్యవహారాల శాఖ. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పొందుపరుస్తూ ఈ ప్రమాదంలో ఇద్దరు పోలీసులు స్వల్పంగా గాయపడినట్లు తెలిపింది. బాంబు శబ్దానికి చుట్టుపక్కల ఉన్నవారంతా భయంతో పరుగులు తీశారు. తీవ్రవాదులు దాడులు చేసిన జిల్లాలో పార్లమెంట్ సహా అనేక ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఉన్నాయని తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ప్రసంగం తర్వాత పార్లమెంట్ సమావేశాలు జరగాల్సి ఉన్నాయని అంతలోనే ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారని తెలిపింది స్థానిక మీడియా. దాడులు జరిగిన సమాచారం అందగానే అత్యవసర సేవల విభాగం వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి తరలి వచ్చారు. A terrorist attack occurred outside Turkey's interior ministry in Ankara. Two attackers, arriving in a commercial vehicle, executed the assault, injuring two officers. One attacker detonated himself in front of a ministry building, while the other was neutralized. The… pic.twitter.com/ovaiv3eVky — Pakistani Index (@PakistaniIndex) October 1, 2023 ఇది కూడా చదవండి: భారత సంతతి జడ్జి చేతిలో గూగుల్ భవితవ్యం -
నివారించలేం, జననష్టం తగ్గించగలం
సుమారు 46,000 మందిని బలిగొన్న టర్కీ భూకంపంలో ఇంతటి భారీ ప్రాణనష్టాన్ని నివారించేందుకు అవకాశం ఉండిందా? దాదాపు టర్కీ మొత్తం భూకంప ప్రమాద పరిధిలోనే ఉన్నప్పటికీ, ప్రభుత్వంలోని విపరీతమైన అవినీతి ఫలితంగా భవన నిర్మాణ నియంత్రణలు అమల్లోకి రాలేదు. భవిష్యత్తులో వచ్చే భూకంపాలను సమర్థంగా ఎదుర్కొనేందుకని ‘భూకంప పన్ను’ కూడా వసూలు చేశారు. ఆ మొత్తాన్ని ఎలా ఖర్చు పెట్టారన్న విషయంలో అనేక ప్రశ్నలున్నాయి. ఈ మొత్తాన్నీ గమనిస్తే ఒక విషయం స్పష్టమవుతోంది. భూకంప ముప్పును ఎదుర్కొనే విషయంలో టర్కీ వద్ద ఉన్న జ్ఞానానికీ, ఆచరణకూ మధ్య అంతరం ఉంది. ఇలాంటి విధ్వంసానికి సన్నద్ధంగా ఉండటం అసంభవం.’’ ఫిబ్రవరి ఆరున టర్కీని భారీ భూకంపం తాకిన రెండు రోజులకు అత్యంత దారుణంగా దెబ్బతిన్న ప్రాంతంలో పర్యటించిన తర్వాత ఆ దేశ అధ్యక్షుడు రీజెప్ తాయిప్ ఎర్డోగాన్ చేసిన వ్యాఖ్య ఇది. నిజంగానే ఇంతటి విధ్వంసపు స్థాయి ఇంతకుముందు చూడనిదే. తెలతెల వారుతూండగానే 7.8 తీవ్రతతో భూకంపం రావడం, వేల మందిని బలితీసుకోవడం ఘోరమే. (సుమారు 46,000 మంది చనిపోయారని అంచనా.) అత్యంత హృదయ విదారకమైన ప్రకృతి వైపరీత్యాల్లో ఇదీ ఒకటి. అయితే, ఇంతటి ప్రాణనష్టాన్ని, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు అవకాశం ఉండిందా? పూర్తిగా కాకపోయినా పాక్షికంగానైనా తగ్గించే వీలు లేకపోయిందా? అసాధ్యమని ఎవరైనా చెబితే అది రాజకీయ ప్రకటనే అవుతుంది. టర్కీకి భూకంపం ముప్పు ఉందని తెలిసినా అందుకు సన్నద్ధంగా లేకపోవడం కచ్చితంగా ఓ వైరుధ్యమే. చేజారిన అవకాశాలు భూకంప ముప్పునకు సంబంధించి టర్కీ ఒక మ్యాపును రూపొందించింది. 2018 లోనే దీన్ని సమీక్షించి, మార్పులు చేర్పులు చేసి ప్రచురించారు కూడా. దాని ప్రకారం దాదాపు దేశం మొత్తానికి భూకంప ప్రమాదం ఉంది. తూర్పు అనతోలియా ఫాల్ట్ జోన్, ఉత్తర అన తోలియా ఫాల్ట్ జోన్ రెండూ దేశాన్ని అల్లుకుని ఉన్నాయి! దాదాపు 1,400 కిలోమీటర్ల పొడవైన ఉత్తర అనతోలియా ఫాల్ట్ జోన్ టర్కీ ఉత్తరార్ధ భాగంలో తూర్పు నుంచి పశ్చిమానికి ఉంది. దేశంలోని ప్రధాన నగరాలైన అంకారా, ఇస్తాంబుల్‌తో పాటు, పారిశ్రామిక వాడలు కూడా ఈ ఫాల్ట్ జోన్ వెంబడే ఉన్నాయి. మరోవైపు తూర్పు అనతోలియా ఫాల్ట్ జోన్ వెయ్యి కిలోమీటర్ల పొడవుతో దేశ ఆగ్నేయ ప్రాంతం గుండా ప్రయాణిస్తూంటుంది. లక్షల జనాభా ఉన్న చిన్న చిన్న నగరాలు, పల్లెలు ఈ జోన్లోనే ఉన్నాయి. ఈ సమస్యను ఎదు ర్కొనేందుకు టర్కీ ఇప్పటికి చాలా ప్రయత్నాలే చేసింది. 1959లో ఆ దేశ పార్లమెంటు ‘డిజాస్టర్ లా 7269’(విపత్తు చట్టం)ను ఆమోదించింది. ప్రకృతి వైపరీత్యాల నష్టాన్ని నివారించేందుకు ప్రణాళికలను రూపొందించాలనీ, జాతీయ స్థాయి నుంచి మున్సిపాలిటీల వరకూ నియమ, నిబంధనలు సిద్ధం చేయాలనీ తీర్మానించారు. ఈ ఏర్పా ట్లన్నీ ప్రజల్లో భూకంప విపత్తుపై కొంత అవగాహనైతే పెంచాయి కానీ, 1990లలో గణనీయమైన స్థాయిలో ఉన్న ఐదు భూకంపాలు చోటు చేసుకున్నా మార్పులేమీ కనబడకపోవడంతో ఆ చట్టంపై ఆశలు సన్నగిల్లాయి. 1999లో మార్మరా ప్రాంతంలో వచ్చిన భూకంపాల్లో సుమారు 17 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తరువాత టర్కీ ప్రభుత్వం భూకంపాలను తట్టుకునే భవనాల నిర్మాణానికి, ప్రోత్సా హానికి ఒక కార్యక్రమం చేపట్టింది. అయినాసరే, ప్రభుత్వంలోని విపరీతమైన అవినీతి ఫలితంగా ఈ భవన నిర్మాణ నియంత్రణలు అమల్లోకి రాలేదు. భవిష్యత్తులో భూకంపాలు వస్తే వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకని ప్రభుత్వం ‘భూకంప పన్ను’ పేరుతో పన్నులు వసూలు చేసింది కూడా. దీనిద్వారా సుమారు 460 కోట్ల అమెరికన్ డాలర్ల మొత్తం జమకూడింది. అయితే ఈ మొత్తాన్ని ఎలా ఖర్చు పెట్టారన్న విషయంలో అనేక ప్రశ్నలు తలెత్తాయి. 2009లో టర్కీ ‘నేషనల్ డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అథారిటీ’ (జాతీయ విపత్తు మరియు అత్యవసర పరిస్థితి నిర్వహణ సంస్థ) ఒకదాన్ని ఏర్పాటు చేసింది. విపత్తు నిర్వహణకు సిబ్బందిని సిద్ధం చేయడం, తద్వారా ప్రమాద నష్టాన్ని తగ్గించడం దీని ఉద్దేశం. రాష్ట్ర, మున్సిపాలిటీ స్థాయిల్లో సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, భూకంపాలు వచ్చినప్పుడు ఎలా వ్యవహరించాలో ప్రజలకు వివరించడం దీని పని. 2014లోనూ టర్కీ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ప్లాన్ (జాతీయ విపత్తు సంసిద్ధతా పథకం) ఒకదాన్ని సిద్ధం చేసింది. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రభుత్వ సంస్థలు ఎలాంటి పాత్ర పోషించాలో సూచించిందీ పథకం. పోషకాహారం, అత్యవసర గృహ వసతి, సమాచార వ్యవస్థలు.. ఇలా వేర్వేరు బృందాలను ఏర్పాటు చేసి వాటికి నిర్దిష్ట బాధ్యతలు అప్పగించారు. 2014లోనే సోమా ప్రాంతంలో భూగర్భ గనిలో ఓ అగ్ని ప్రమాదం చోటు చేసుకుని 301 మంది మరణించారు. ఈ ఘటనపై సమీక్షించిన టర్కీ ప్రభుత్వం జాతీయ విపత్తు పథక పునఃసమీక్షకు నిర్ణయించింది. జపాన్, అమెరికా, యూరప్ ప్రతినిధులతో కూడిన సలహా కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సూచించిన మార్పులను జాతీయ విపత్తు పథకంలో చేర్చారు. నిరంతర నిఘా, విపత్తు నిర్వహణ సిబ్బందికి మరింత ఆధునికమైన శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తేవడం, సంస్థల మధ్య సమన్వయం వంటి మార్పులు చేశారు. అయితే ఈ ప్రణాళికలను 2015 జనవరి నుంచే సైద్ధాంతికంగా అమల్లో పెడుతున్నట్లు నేతలు ప్రకటించారు కానీ, వాస్తవ ఆచరణ ఇప్పటికీ జరగలేదు. నేషనల్ డిజాస్టర్అండ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అథారిటీ నాయకత్వాన్ని మార్చడంతో సరిపెట్టింది ప్రభుత్వం. పైగా మంచి శిక్షణ, ఆధునిక సమాచార వ్యవస్థలు కావాలని కోరిన వారిని పదవుల నుంచి తప్పించింది. ఈ మార్పులు స్థానిక ప్రభుత్వాలపై తీవ్ర ప్రభావం చూపాయి. జపాన్, కాలిఫోర్నియా పాఠాలు... మార్పులు చేసిన నేషనల్ డిజాస్టర్ ప్లాన్ అమలు చేయకపోవడం ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. భూకంప ముప్పును ఎదుర్కొనే విషయంలో టర్కీ వద్ద ఉన్న జ్ఞానానికీ, ఆచరణకూ మధ్య అంతరం ఉంది. భూకంపాలను ఎలాగూ ఆపలేము. కానీ వాటిని తట్టుకోగల భవనాలను నిర్మించవచ్చు. జపాన్, కాలిఫోర్నియాల్లో ఇదే జరిగింది. భూకంపాలను తట్టుకోగల భవనాలకు సంబంధించిన నియమావళిని టర్కీ రూపొందించింది. దేశంలో 1.50 లక్షల మంది సివిల్ ఇంజినీర్లూ ఉన్నారు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేలా రోడ్లు, భవనాలు, వంతెనలు ఎలా కట్టాలో వీరికి తెలుసు. అయితే ఇప్పటికే ఉన్న భవనాలను కొత్త ప్రమాణాల ప్రకారం కట్టేందుకు అయ్యే ఖర్చు చాలా ఎక్కువ కావడంతో ఆ కార్యక్రమం చాలా నెమ్మదిగా సాగుతోంది. భవనాల డిజైన్ నియంత్ర ణలు 2000 సంవత్సరం నుంచే అమల్లో ఉన్నా, వాటి అత్యాధునిక అవసరాలను స్థానిక ఇంజినీర్లు పెద్దగా అర్థం చేసుకోలేకపోయారు. భవన నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకూ 2010 నుంచి ఒక కమిటీ ఉంది కానీ దేశంలోని కోటీ అరవై లక్షల భవనాలను పర్యవేక్షించ లేకపోతోంది. భవిష్యత్తు దశ, దిశ 2023 ఫిబ్రవరి ఆరున సంభవించిన భారీ భూకంపంతో టర్కీ పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. స్వల్పకాలికం మాత్రమే కాదు, సుదీర్ఘకాలం పనిచేయగల ప్రణాళికలు అత్యవసరంగా అమలు చేయాల్సిన పరిస్థి తిని ఆ దేశం ఎదుర్కొంటోంది. గృహ నిర్మాణాన్ని ఇప్పటిలానే లోపాలతో కొనసాగించడమా, వ్యయప్రయాసలకు ఓర్చి అత్యాధునిక, దృఢమైన, మెరుగైన డిజైన్ కలిగిన భవన నిర్మాణాలను చేపట్టడమా అన్నది నిర్ణయించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఈ కార్యక్ర మంలో ప్రజలందరినీ భాగస్వాములు చేయడం ద్వారా భూకంపా లతో వచ్చే ముప్పును గుర్తించే సమాజాన్ని సిద్ధం చేయాలి. అంతే కాకుండా తగిన ప్రణాళిక, ఆచరణలతో నష్టాన్ని తగ్గించవచ్చునన్న తెలివిడి కూడా వీరికి కలిగించాల్సిన అవసరం ఉంది. – లూయిస్ కె. కంఫర్ట్, ప్రొఫెసర్, పిట్స్బర్గ్ యూనివర్సిటీ – పోలాత్ గుల్కన్, ప్రొఫెసర్, బాష్కెంట్ యూనివర్సిటీ – బుర్చాక్ బాష్బూ ఎర్కాన్ అసోసియేట్ ప్రొఫెసర్, మిడిల్ ఈస్ట్ టెక్నికల్ యూనివర్సిటీ (‘ద కాన్వర్జేషన్’ సౌజన్యంతో) -
షాపింగ్ స్ట్రీట్‌లో భారీ పేలుడు.. ఆరుగురు మృతి.. 53 మందికి గాయాలు
ఇస్తాంబుల్: టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో ఆదివారం సాయంత్రం భారీ పేలుడు కలకలం సృష్టించింది. నిత్యం పర్యాటకులు, స్థానికులతో రద్దీగా ఉండే బెయోగ్లూ జిల్లాలోని ఇస్తిక్లాల్ షాపింగ్ స్ట్రీట్‌లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 53 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం 4.00 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది. పేలుడు జరిగిన క్రమంలో ఆ ప్రాంతంలోని ప్రజలు భయంతో పరుగులు పెడుతున్న వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక, ఆరోగ్య విభాగం, ఏఎఫ్ఏడీ బృందాలు సంఘటానా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. పేలుడు జరిగిన క్రమంలో ఆ ప్రాంతంలో విస్తృత తనిఖీలు చేపట్టారు పోలీసులు. నగరంలో హెలికాప్టర్లు చక్కర్లు కొట్టాయి. సైరన్ మోగించి ప్రజలను అప్రమత్తం చేశారు. అయితే, పేలుడుకు గల కారణాలను అధికారులు వెల్లడించలేదు. రెండో పేలుడు జరుగుతుందనే అనుమానంతో ఆ ప్రాంతాన్ని మూసివేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. మార్కెట్ ప్రవేశ మార్గాల్లో భారీగా బలగాలను మోహరించినట్లు వెల్లడించింది. ‘ఘటనాస్థలానికి నేను 50-55 మీటర్ల దూరంలోనే ఉన్నాను. ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దం వచ్చింది. ముగ్గురు-నలుగురు పడిపోయి కనిపించారు. భయంతో అక్కడి వారంతా పరుగులు పెట్టారు. నల్లటి పొగ కమ్ముకుంది. శబ్దం చెవులు పగిలిపోయేలా భారీగా వచ్చింది’ అని ప్రత్యక్ష సాక్షి, 57 ఏళ్ల కెమాల్ డెనిజ్కి తెలిపారు. ఇస్తిక్లాల్ షాపింగ్ వీధిలో ఆదివారం భారీగా జనం ఉంటారు. ఈ క్రమంలో పేలుడు జరగటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 2015-2016లో ఇస్తిక్లాల్ స్ట్రీట్‌లో పేలుడు జరిగి సుమారు 500 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ❗Blast hits central #Istanbul, local media report. pic.twitter.com/s95VcL1BRr — NonMua (@NonMyaan) November 13, 2022 విద్రోహ చర్య.. ఖండించిన ప్రెసిడెంట్.. రద్దీగా ఉండే ప్రాంతంలో సామాన్యులే లక్ష్యంగా చేసిన దాడిని ఖండించారు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయీప్ ఎర్డోగాన్. ఇది ఉగ్రవాదులు చేసిన విద్రోహ చర్యేనని పేర్కొన్నారు. దుండగులను పట్టుకునేందుకు సంబంధిత విభాగాలు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. Police cordon off the scene of the explosion in #Istanbul. pic.twitter.com/m0XtxNNa9T — NEXTA (@nexta_tv) November 13, 2022 ఇదీ చదవండి: ‘పులిని చూసిన మేకల్లా పారిపోయారు’.. రష్యా సేనలపై ఉక్రెయిన్ పౌరుల సెటైర్లు -
Turkey: బొగ్గు గనిలో భారీ పేలుడు.. కార్మికుల దుర్మరణం
అంకారా: టర్కీ ఉత్తర భాగంలో ఘోర ప్రమాదం సంభవించింది. అమస్రా వద్ద ఓ బొగ్గు గనిలో మీథేన్ పేలుడు సంభవించి పాతిక మందికి పైగా మరణించారు. డజన్ల మంది ఇంకా గనిలోనే చిక్కుకుని పోయారు. వాళ్లంతా సురక్షితంగా బయటకు రావాలని ప్రార్థనలు చేస్తున్నారు ఆ దేశ ప్రజలు. శుక్రవారం సూర్యాస్తమయం కంటే కాస్త ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. వందల మీటర్ల భూగర్భంలో డజన్ల మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రమాద సమయంలో 110 మందికిపైగా ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. పేలుడు సంభవించిన వెంటనే కొందరు కార్మికులు వాళ్లంతట వాళ్లుగా బయటకు వచ్చిన దృశ్యాలు నెట్లో వైరల్ అవుతున్నాయి. దాదాపు 50 మంది కార్మికులు భూమికి దిగువన 300 మరియు 350 మీటర్ల (985 నుండి 1,150 అడుగులు) మధ్య రెండు వేర్వేరు ప్రాంతాలలో చిక్కుకుని ఉంటారని రెస్క్యూ టీం అంచనా వేస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టింది. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వాళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెఉలస్తోంది. రాత్రి సమయం కావడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో ఈ ఉదయం నుంచి చర్యలు మొదలుకానున్నాయి. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ తన అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని.. శనివారం ప్రమాద స్థలానికి చేరుకుంటారని అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. గతంలో.. 2014లో టర్కీ పశ్చిమ పట్టణం సోమాలో సంభవించిన ఎయ్నజ్ బొగ్గు గని ప్రమాదంలో 310 మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారు. Update- #Rescue operation underway.. At least 25 killed and dozens trapped underground after massive blast tears through coal mine in #Turkey. Around 110 workers were in the mine at the time of the #explosion.#bartin #bartinamasra #MineBlast #News pic.twitter.com/g3mwAgfmkQ — Chaudhary Parvez (@ChaudharyParvez) October 15, 2022 -
టర్కీ పేలుళ్లలో 14 మంది మృతి
అంకారా: వరుస బాంబు పేలుళ్లతో టర్కీ దద్దరిల్లింది. ఈ దాడుల్లో 14 మంది మరణించగా, 226 మంది తీవ్రంగా గాయపడ్డారు. తూర్పు టర్కీలోని పోలీస్స్టేషన్ల సమీపంలో మొదట రెండు కారు బాంబులు పేలాయి. తర్వాత ఆగ్నేయ టర్కీలో సైనికులను తరలిస్తున్న మిలటరీ వ్యాన్ లక్ష్యంగా చేసుకొని రోడ్డు పక్కన అమర్చిన మరో బాంబు పేలింది. దీనికి బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ఏ సంస్థ కూడా ప్రకటన చేయలేదు. బుధవారం అర్ధరాత్రి తూర్పు టర్కీలోని వ్యాన్ లేట్‌లో మొదటి కారు బాంబును పేల్చారు. ఈ ఘటనలో ఒక పోలీస్ అధికారి, ఇద్దరు పౌరులు మరణించారు. 20 మంది పోలీసులు, 53 మంది పౌరులు గాయపడ్డారు. తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే గురువారం తెల్లవారుజామున ఎలాజిగ్లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ వద్ద మరో కారును పేల్చారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు మరణించగా, 146 మంది గాయపడ్డారు. 14 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ పేలుడు ధాటికి సమీపంలోని కార్లు నాశనమవ్వగా, భవనాలు దెబ్బ తిన్నాయి. -
శాంతి ర్యాలీపై బాంబు పేలుళ్లు