తుర్కియే పార్లమెంట్ భవనం ఎదుట ఆత్మాహుతి దాడి  | Blast Near Turkey Parliament building Government Calls Terror Act | Sakshi
Sakshi News home page

తుర్కియే పార్లమెంట్ భవనం ఎదుటే ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి

Published Sun, Oct 1 2023 2:51 PM | Last Updated on Sun, Oct 1 2023 7:17 PM

Blast Near Turkey Parliament building Government Calls Terror Act - Sakshi

అంకారా: పాకిస్తాన్‌లో జరిగిన ఆత్మాహుతి దాడి మిగిల్చిన విషాదాన్ని మరువక ముందే తుర్కియేలో ఉగ్రావాదులు పంజా విసిరారు. తుర్కియే పార్లమెంట్ భవనం ఎదుట ఆదివారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు పోలీసు అధికారులు గాయపడినట్లు తెలిపింది తుర్కియే అంతర్గత వ్యవహారాల శాఖ. ప్రభుత్వం ఇది తీవ్రవాదుల పనేనని ప్రకటించింది. 

ఆదివారం ఉదయం 9.30 ప్రాంతంలో ఇద్దరు తీవ్రవాదులు ఒక కమర్షియల్ వాహనంలో తుర్కీయే పార్లమెంట్ భవనం వద్దకు వచ్చారు. డైరెక్టరేట్ జనరల్ భద్రతా విభాగం ఎంట్రన్స్ గేట్ వద్దకు రాగానే వీరిద్దరూ బాంబులతో దాడి చేశారనన్నారు. వారిలో ఒకరు ఆత్మాహుతికి పాల్పడగా మరొక తీవ్రవాది బాంబును నిర్వీర్యం చేశామని తెలిపింది అంతర్గత వ్యవహారాల శాఖ. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పొందుపరుస్తూ ఈ ప్రమాదంలో ఇద్దరు పోలీసులు స్వల్పంగా గాయపడినట్లు తెలిపింది. బాంబు శబ్దానికి చుట్టుపక్కల ఉన్నవారంతా భయంతో పరుగులు తీశారు.

తీవ్రవాదులు దాడులు చేసిన జిల్లాలో పార్లమెంట్ సహా అనేక ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఉన్నాయని తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ప్రసంగం తర్వాత పార్లమెంట్ సమావేశాలు జరగాల్సి ఉన్నాయని అంతలోనే ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారని తెలిపింది స్థానిక మీడియా. దాడులు జరిగిన సమాచారం అందగానే అత్యవసర సేవల విభాగం వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి తరలి వచ్చారు.

ఇది కూడా చదవండి: భారత సంతతి జడ్జి చేతిలో గూగుల్‌ భవితవ్యం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement