చండీగఢ్: పంజాబ్ అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం సమీపంలో భారీ పేలుడు సంభవించింది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఆరుగురు అమ్మాయులు గాయపడ్డారు. పేలుడు శబ్దం వినగానే ఆలయంలోని భక్తులు, స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఉగ్రదాడి జరిగి ఉంటుందని తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇది ఉగ్రదాడి కాదని చెప్పారు. పరిస్థితి అదుపులోనే ఉందని, ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. శాంతియుతంగా ఉండాలని సూచించారు.
Video: Several injured in blast near #Amritsar's Golden Temple https://t.co/GWEtgJ37sH pic.twitter.com/XwLJxvg1T0
— TOIChandigarh (@TOIChandigarh) May 7, 2023
ఫోరెన్సిక్ టీం పేలుడు జరిగిన ప్రదేశానికి వెళ్లింది. అక్కడ లభించిన కొంత పౌడర్‌ను స్వాధీనం చేసుకుంది. దీనిపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని పోలీసులు పేర్కొన్నారు. పేలుడు ధాటికి కిటికీ అద్దాలు ధ్వంసమై రోడ్డుపై ఆటోలో వెళ్తున్న ఆరుగురు అమ్మాయిలకు స్వల్పగాయాలయ్యాయని ఓ స్థానికుడు తెలిపాడు.
చదవండి: బైక్‌లే ఉన్నాయ్.. జనాలేరీ?.. బీజేపీ శ్రేణులపై అమిత్‌షా సీరియస్
Comments
Please login to add a commentAdd a comment