బీజింగ్: చైనా రాజధాని బీజింగ్‌కు 50 కిలోమీటర్ల దూరంలోని యాంజియావోలో బుధవారం ఉదయం 7.55 గంటలకు(చైనా కాలమానం ప్రకారం)భారీ పేలుడు సంభవించింది. ఓ పాత నివాసభవనంలోని కింది అంతస్తులో ఉన్న రెస్టారెంట్‌లో గ్యాస్ పేలుడు సంభవించినట్లు సమాచారం. పేలుడు ధాటికి చుట్టుపక్కల భవనాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి.
🚨🇨🇳 BREAKING: HUGE EXPLOSION IS REPORTED IN YANJIAO, CHINA
— Mario Nawfal (@MarioNawfal) March 13, 2024
The explosion happened in a building. There's no immediate report on casualties.pic.twitter.com/XylJsBuLUW
భవనాల శిధిలాలు ఆ ప్రాంతమంతా చెల్లాచెదురుగా పడ్డాయి. పేలుడు తర్వాత భారీ నీలి మంటలు ఎగిసిపడినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ పేలుడులో ఎంత మంది చనిపోయారో వివరాలు తెలియాల్సి ఉంది. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. రెస్క్యూటీమ్ సహాయక చర్యలు మొదలు పెట్టింది.
#BREAKING- Large explosion damages multiple buildings in Yanjiao, China.
— Chaudhary Parvez (@ChaudharyParvez) March 13, 2024
No word on injuries at this time.#explosion #China #Yanjiaopic.twitter.com/lQ6UMCTv30
Comments
Please login to add a commentAdd a comment