ఆర్మీ క్యాంపుపై దాడికి తెగబడిన ఉగ్రవాదులు
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఉత్తర కశ్మీర్ కుప్వారా జిల్లాలోని రెండు సైనిక శిభిరాలపై గురువారం తెల్లవారు జామున 5 గంటలకి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. హంద్వారాలోని 30 ఆర్ఆర్ ఆర్మీ క్యాంపు, లాంగ్ గేట్ ఆర్మీ క్యాంపును లక్ష్యంగా చేసుకొని మెరుపుదాడికి యత్నించారు. ఉగ్రదాడిని భద్రతాదళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. జవాన్లకు ఉగ్రవాదులకు హోరాహోరీగా కాల్పులు జరిగాయి. ఇందులో ఇద్దరు ఉగ్రవాదులను ఆర్మీ మట్టుపెట్టింది. అదనపు బలగాలను రంగంలోకి దింపిన ఆర్మీ ముమ్మర గాలింపు చర్యలు చేపట్టింది.