జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఉత్తర కశ్మీర్ కుప్వారా జిల్లాలోని సైనిక శిభిరంపై గురువారం ఉదయం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. హంద్వారాలోని 30 ఆర్ఆర్ ఆర్మీ క్యాంపు లక్ష్యంగా కాల్పులకు దిగారు. లాంగ్గేట్ ఆర్మీ క్యాంపు సమీపంలో ఉగ్రవాదులకు ఆర్మీ జవాన్లకు మధ్య హోరాహోరీగా కాల్పులు కొనసాగుతున్నాయి