జిల్లాలో రెండో స్థానం.. ఏటా కోట్ల రూపాయల్లో ఆదాయం.. అయినా కనీస సౌకర్యాలు మాత్రం కానరావు. ఇదీ భైంసా మార్కెట్ కమిటీ దుస్థితి.
భైంసా : జిల్లాలో రెండో స్థానం.. ఏటా కోట్ల రూపాయల్లో ఆదాయం.. అయినా కనీస సౌకర్యాలు మాత్రం కానరావు. ఇదీ భైం సా మార్కెట్ కమిటీ దుస్థితి. గతేడాది పత్తి కొనుగోళ్లతో భైంసా మార్కెట్ క మిటీ ఆదాయం రూ.5.50కోట్లు దాటిం ది. ప్రస్తుతం మొత్తం ఆదాయం రూ. 12.50 కోట్లు ఉంది. ఈ ఆదాయంతో మార్కెట్ కమిటీలో ఎన్నో పనులు చేపట్టవచ్చు. కానీ.. మార్కెట్ ఆధునికీకరణ కోసం పాలకులు ఏ పనులూ చేయడంలేదు. భైంసా మార్కెట్ కమిటీకి స్థలం లేదన్న సాకుతో ఉన్నతాధికారులు ఇక్కడి ఆదాయాన్ని ఇతర మార్కెట్ కమిటీలకు తరలిస్తున్నారు. ఫలితంగా ఏటా ఈ ప్రాంత రైతులకు కష్టాలు తప్పడంలేదు.
సిద్దిపేటకు...
భైంసా మార్కెట్ కమిటీకి ఉన్న ఆదాయంలో నుంచి రూ.8 కోట్లను సిద్దిపేట మార్కెట్ కమిటీకి రుణం రూ పేణా తరలించేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ఇచ్చి న రుణానికి 8 శాతం వడ్డీతో కలిపి 10 కిస్తీల్లో చెల్లిస్తామని ప్రతిపాదనలో పేర్కొన్నట్లు సమాచారం. ప్రతిపాదనలు వచ్చాక ఇక్కడి ఆదాయం సిద్దిపేటకు తరలడం ఖాయమే. మార్కెట్ కమిటీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేస్తే రూ.8 కోట్లు తరలిపోవడమే. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి భైంసా మార్కెట్ కమిటీ అభివృద్ధికి నిధులు వెచ్చిస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఏటా పత్తి సీజన్‌లో భైంసా డివిజన్ పత్తి రైతాంగం ఎన్నో ఇబ్బందులు పడుతోంది.
పట్టింపులేదు..
భైంసా మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లు జిల్లాలోనే రెండో స్థానంలో ఉంటే ఇక్కడి సౌకర్యాల్లో పూర్తిగా వెనుకబడి ఉన్నాయి. ఇరుకైన యార్డులోనే కొనుగోళ్లు నిర్వహించడంతో పత్తి సీజన్‌లో బండ్లన్నీ ప్రధాన రోడ్లకు ఇరువైపులా నిలిచి ఉంటాయి. రోడ్లపై నిలిచిన ఈ వాహనాల తో ప్రమాదాలు కూడా జరిగాయి. కొత్త యార్డు కోసం స్థలం సేకరిస్తున్నామంటూ అధికారులు తాత్సారం చేస్తున్నారు. పెద్ద మొత్తంలో కొనుగోళ్లు జరిగే భైంసాకు 50ఎకరాల స్థలంలో అన్ని వసతులతో మార్కెట్ యా ర్డును నిర్మించవచ్చు. భైంసాలో పత్తి కొనుగోళ్లే తప్ప ఇతర పంటలు విక్రయించేందుకు రైతులు ఇబ్బం దులు పడుతున్నారు. సోయాబీన్, మిరప, మినుములు, కందులు విక్రయించేందుకు యార్డు లేదు.
మహారాష్ట్రకు తరలింపు..
సౌకర్యాలలేమితో పత్తి సీజన్‌లో రోజుల తరబడి నిరీ క్షించలేక ఈ ప్రాంత రైతులు సరిహద్దు మహారాష్ట్రలో ని ధర్మాబాద్, బోకర్ ప్రాంతాలకు వెళ్తున్నారు. ఫలి తంగా భైంసా ఏఎంసీకి వచ్చే ఆదాయం మహారాష్ట్ర కు తరలిపోతోంది. రోజుల తరబడి అద్దె వాహనాల కు డబ్బులు చెల్లించలేక రోడ్లపై నిరీక్షించలేక పత్తి రైతులు ఈ నిర్ణయానికి వచ్చారు. గతేడాది 70 శాతం పత్తి రైతులు మహారాష్ట్రకు వెళ్లి పత్తిని విక్రయించారు. పెద్ద మొత్తంలో కొనుగోళ్లు జరుగుతున్నా ఈ యార్డు లో వంద మంది రైతులైనా సేదదీరే పరిస్థితి లేదు. రైతుల కోసం ఎక్కడ పెద్ద మొత్తంలో సౌకర్యాలతో విశ్రాంతి భవనాలు నిర్మించలేదు. పత్తి రైతులకే పరేషాన్ ఉన్న భైంసా యార్డులో ఇతర పంటల కొనుగోళ్లు ఇంత వరకు జరుగలేదు. విక్రయించేందుకు ఈ నిజామాబాద్, మహారాష్ట్రలకు వెళ్తున్నారు.
గోదాంలు లేవు...
ఈ ప్రాంతంలో పెద్ద మొత్తంలోనే పత్తి కొనుగోళ్లు జరుగుతాయి. గత రెండు, మూడేళ్ల క్రితం భైంసాలో సీసీఐ, నాఫెడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం పత్తి కొనుగో ళ్లు చేపట్టింది. ఆ సమయంలో పత్తి బేళ్లు నిల్వ ఉం చేందుకు సరిపడా గోదాంలు కూడా ఇక్కడ లేవు. 20 నుంచి 30 వేల పత్తి బేళ్లను నిల్వ చేసేందుకు ఆదిలాబాద్, నిజామాబాద్, బోధన్, రుద్రూర్, హైదరాబా ద్ గోదాంలకు తరలించారు. వంద పత్తి బేళ్లు తరలిం చేందుకే రూ.20వేల మేర ఖర్చు చేశారు. ఈ ఖర్చం తా ప్రభుత్వంపైనే పడుతుంది.
వంద బేళ్లకే రూ.20 వేలు వెచ్చిస్తే వేలల్లో తరలించిన బేళ్లకు కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం దుర్వినియోగమైంది. ఇదే మా ర్కెట్‌లో అన్ని సౌకర్యాలతో గోదాంలు నిర్మించి ఉం టే పత్తి బేళ్లు ఇక్కడే నిల్వ చేసే అవకాశం ఉండేది. గో దాంతోపాటు రైతుల కోసం విశ్రాంతి భవనాలు, భైం సా, నిర్మల్ ప్రధాన రహదారిపై మార్కెట్ యార్డు ని ర్మిస్తే రవాణా పరంగా ఇబ్బందులుండవు. ఇప్పటికై నా అధికారులు తేరుకుని భైంసా మార్కెట్ కమిటీలో ఉన్న సమస్యలపై దృష్టి సారించి ప్రస్తుతం ఉన్న ఆదాయాన్ని ఇక్కడే వెచ్చించాలి.
ప్రతిపాదనలు వచ్చాయి - అజ్మీరరాజు, ఏఎంసీ సెక్రటరీ
సిద్దిపేట మార్కెట్ కమిటీ అధికారులు రూ.8 కోట్లు అవసరం అని ప్రతిపాదించారు. కమిషనర్ ఆదేశాల కు అనుగుణంగా నడుచుకుంటాం. భైంసా మార్కెట్ కమిటీ ఇరుకుగా ఉంది. నూతనంగా యార్డు నిర్మాణానికి స్థల సేకరణలో ఉన్నాం. స్థలం దొరికితే ప్రైవేట్‌లోనైనా తీసుకునే విషయంపై ఆలోచిస్తాం.