సిద్ధిపేట : తెలంగాణ తల్లి విగ్రహానికి జాగ కరువైంది. సిద్దిపేట వ్యవసాయ మార్కెట్‌లోని ప్రహరీ పక్కన చెత్తలో విగ్రహం పడి ఉంది. కరీంనగర్ చౌరస్తాలో ఉన్న ఈ విగ్రహాన్ని కొన్ని కారణాలతో మార్కెట్ వద్దకు తీసుకొచ్చి.. ఇలా నిర్లక్ష్యంగా వదిలేశారు. విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు అధికారులకు స్థలం కనిపించ లేదా..? అంటూ మార్కెట్‌కు వచ్చే రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment