
సాక్షి, సిద్దిపేట: రాష్ట్ర ప్రజల ఆకాంక్ష 29వ తేదీతో నెరవేరబోతుందని టీఎస్‌ఎఫ్‌డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం రాత్రి సీఎం కేసీఆర్ ఫొన్ కాల్ మేరకు చేబర్తి చెరువుకు తుం ద్వారా కొండపోచమ్మ ప్రాజెక్టు కోసం అటవీ అభివృద్ధి సంస్థ 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో చైర్మన్ ప్రతాప్‌తో పాటు సర్పంచ్ అశోక్‌లు, మహిళలు బోనాలతో తరలివచ్చారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా త్వరలో కొండపోచమ్మ సాగర్ ప్రారంభం కాబోతోందని చెప్పారు. (మర్కూక్ గ్రామ సర్పంచ్‌కు కేసీఆర్ ఫోన్!)
తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మొదలయిందే నీళ్ల కోసమన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన కేసీఆర్కు పాదాభివందనం అని ఆయన వ్యాఖానించారు. గతంలో సరైన సమయంలో వర్షాలు పడక రైతులు నష్టపోయేవారు, ఇకముందు ఆ పరిస్థితి రాష్ట్రానికి లేదన్నారు. ఎక్కడైనా వంపుకు ఉన్న ప్రాంతానికి నీళ్లు వస్తాయి కానీ కేసీఆర్ కృషి వల్ల ఎత్తుకు నీటిని తరలించుకుంటున్నామన్నారు. మనంజన్మలో సాధ్యమవుతుందా అని అనుకున్న.. అసాధ్యమైన పనిని కేసీఆర్ సుసాధ్యంతో చేశారని వ్యాఖ్యానించారు. అలాగే చేబర్తి గ్రామ సర్పంచ్ అశోక్ మాట్లాడుతూ.. ఫోన్ చేసి మీ చెరువు నింపుతామని సీఎం కేసీఆర్ చెప్పడం చాలా సంతోషంగా ఉందన్నారు. మా గ్రామం తరుపున కేసీఆర్ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. (భాస్కర్.. ఏం నడుస్తుంది? :కేసీఆర్)
Comments
Please login to add a commentAdd a comment