Vanteru Pratap Reddy
-
‘మే 29 రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నేరవేరే రోజు’
సాక్షి, సిద్దిపేట: రాష్ట్ర ప్రజల ఆకాంక్ష 29వ తేదీతో నెరవేరబోతుందని టీఎస్ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం రాత్రి సీఎం కేసీఆర్ ఫొన్ కాల్ మేరకు చేబర్తి చెరువుకు తుం ద్వారా కొండపోచమ్మ ప్రాజెక్టు కోసం అటవీ అభివృద్ధి సంస్థ 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో చైర్మన్ ప్రతాప్‌తో పాటు సర్పంచ్ అశోక్‌లు, మహిళలు బోనాలతో తరలివచ్చారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా త్వరలో కొండపోచమ్మ సాగర్ ప్రారంభం కాబోతోందని చెప్పారు. (మర్కూక్ గ్రామ సర్పంచ్‌కు కేసీఆర్ ఫోన్!) తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మొదలయిందే నీళ్ల కోసమన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన కేసీఆర్‌కు పాదాభివందనం అని ఆయన వ్యాఖానించారు. గతంలో సరైన సమయంలో వర్షాలు పడక రైతులు నష్టపోయేవారు, ఇకముందు ఆ పరిస్థితి రాష్ట్రానికి లేదన్నారు. ఎక్కడైనా వంపుకు ఉన్న ప్రాంతానికి నీళ్లు వస్తాయి కానీ కేసీఆర్ కృషి వల్ల ఎత్తుకు నీటిని తరలించుకుంటున్నామన్నారు. మనంజన్మలో సాధ్యమవుతుందా అని అనుకున్న.. అసాధ్యమైన పనిని కేసీఆర్ సుసాధ్యంతో చేశారని వ్యాఖ్యానించారు. అలాగే చేబర్తి గ్రామ సర్పంచ్ అశోక్ మాట్లాడుతూ.. ఫోన్ చేసి మీ చెరువు నింపుతామని సీఎం కేసీఆర్ చెప్పడం చాలా సంతోషంగా ఉందన్నారు. మా గ్రామం తరుపున కేసీఆర్ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. (భాస్కర్.. ఏం నడుస్తుంది? :కేసీఆర్) -
నెల రోజుల్లో కాళేశ్వరం నీళ్లు
గజ్వేల్: కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు మరో నెల రోజుల్లోపు కొండపోచమ్మ సాగర్ జలాశయంలోకి రానున్నాయని, దీని ద్వారా ఎండా కాలంలోనూ చెరువులు, కుంటలు నింపుకునే అవకాశం ఉంటుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్, వర్గల్ మండలాల్లో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ భూపతిరెడ్డిలతో కలసి పర్యటించి పలు అభివృద్ధి పనులకు ప్రారంభో త్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కరువును శాశ్వతంగా పారదోలేందుకు సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో చేస్తున్న పనులు సత్ఫలితాలను ఇస్తున్నాయని చెప్పారు. కొండపోచమ్మ సాగర్‌కి నీళ్లు వస్తే సిద్దిపేటతో పాటు యాదాద్రి, మేడ్చల్, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. -
అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా వంటేరు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ కొత్త చైర్మన్‌గా టీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాప్‌రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల పాటు ప్రతాప్‌రెడ్డి ఈ పదవిలో కొనసాగుతారని, కొత్త చైర్మన్ తన విధులు నిర్వహించేందుకు వీలుగా ఆయనకు కార్యాలయం, వాహనాలు, సిబ్బంది, ఇతర సౌకర్యాలు కల్పించాల్సిందిగా పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతాప్‌రెడ్డి నియామకం నేపథ్యంలో ఆయన బుధవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలసి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో అటవీ సంపదను పరిరక్షించడంతో పాటు, పచ్చదనం పెంపుదలకు కృషి చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ సూచించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బూరుగుపల్లికి చెందిన వంటేరు ప్రతాప్‌రెడ్డి సుదీర్ఘంగా గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో కాంగ్రెస్‌ను వీడి సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. -
రేపు టీఆర్ఎస్లోకి ఒంటేరు ప్రతాప్ రెడ్డి!
-
టీఆర్ఎస్లోకి ఒంటేరు ప్రతాప్ రెడ్డి!
సాక్షి, సిద్ధిపేట : తెలంగాణ రాజకీయాల్లో మరో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ కీలక నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి పార్టీ మారనున్నట్లు సమాచారం. రేపు(శుక్రవారం) సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, 2018లో కాంగ్రెస్ పార్టీ తరఫున గజ్వేల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రతాప్ రెడ్డి బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన ప్రత్యర్థి కేసీఆర్ చేతిలో రెండు పర్యాయాలు ఆయన ఓటమి పాలయ్యారు. -
ప్రతాప్‌రెడ్డి పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పోలింగ్ సందర్భంగా అక్రమాలు చోటు చేసుకున్నాయని, వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించేటట్లు ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. అక్రమాలు జరిగాయని భావిస్తే ఎన్నికల ట్రిబ్యునల్‌లో కేసు దాఖలు చేసుకోవాలని ఓట్లలెక్కింపు ప్రారంభమైన తర్వాత ఎన్నికల వివాదాల్లో తాము జోక్యం చేసుకోలేమంది. -
కేసీఆర్‌కు రెండు ఓట్లున్నా ఒకటి తొలగించి ఉంటారు..
సాక్షి, హైదరాబాద్: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రెండు ఓట్లు కలిగి ఉన్నారంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో హైకోర్టు సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కేసీఆర్‌కు రెండు ఓట్లున్నా ఒకదానిని తొలగించి ఉంటారని, అది రికార్డులో నమోదై ఉండదని, రెండు ఓట్లు ఉన్నా కేసీఆర్ వేసింది ఒక ఓటేగా అంటూ వ్యాఖ్యానించింది. గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పోలింగ్ సందర్భంగా పలు అక్రమాలు చోటు చేసుకున్నాయని, అందువల్ల వీవీ ప్యాట్ స్లిప్పులను సిబ్బంది ద్వారా లెక్కించేటట్లు ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ప్రస్తావనకు వచ్చినప్పుడు హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఇదే సమయంలో తమ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలంటూ ప్రతాప్‌రెడ్డి తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. సాధారణ పద్ధతిలో ఈ వ్యాజ్యం విచారణకు వచ్చినప్పుడే చేపడతామని ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ ఎన్నికల్లో తనను ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ప్రతాప్‌రెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియను ప్రతి దశలోనూ ప్రభావితం చేశారని, ఇందులో భాగంగా సిబ్బంది చేత ఈవీఎంలను మార్పించారని తెలిపారు. దీనిపై అభ్యంతరం చెప్పినందుకు పోలీసుల చేత తనపై, తన కుటుంబసభ్యులపై, పోలింగ్ ఏజెంట్లపై భౌతికదాడులు చేయించారని వివరించారు. ఈవీఎంలు తారుమారైనందున వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలంటూ ఎన్నికల సంఘం అధికారులకు వినతిపత్రం సమర్పించానని, అయితే అన్ని స్లిప్పులను లెక్కించడం సాధ్యంకాదని, ఏదో ఒక బాక్స్‌లో ఉన్న స్లిప్పులను లెక్కిస్తామని వారు చెప్పారన్నారు. మొత్తం 306 బూత్‌లుంటే, ప్రతి బూత్‌లో 20 ఓట్లను తారుమారు చేశారని, దీంతో 7 వేల ఓట్లు ప్రభావితమవుతాయని, గెలుపోటములను నిర్ణయించేందుకు ఈ సంఖ్య సరిపోతుందన్నారు. రెండు లక్షల కంటే తక్కువ ఉన్న వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించేందుకు అయ్యే వ్యయాన్ని భరించేందుకు తాను సిద్ధంగా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. -
చచ్చినా సరే వదిలేది లేదు : వంటేరు
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌పై 50 నుంచి 60 వేల మెజారిటీతో గెలబోతున్నానని ప్రజాకూటమి అభ్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. 24 గంటలు గడుస్తున్నా పోలింగ్ ఎంత శాతం అయిందో ఎన్నికల కమిషన్ ప్రకటించలేదని విమర్శించారు. గజ్వెల్ ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయనే అనుమానాల నేపథ్యంలో సీఈఓను కలిశామని తెలిపారు. ‘వీవీ ప్యాట్‌లో వచ్చిన స్లిప్పులను లెక్కించాలని ఎన్నికల కమిషన్‌ను కోరాం. అవసరమైతే ఈ విషయంపై హైకోర్టులో కేసు వేసే ఆలోచనలో కూడా ఉన్నాం’ అని వ్యాఖ్యానించారు. శనివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. వీవీ ప్యాట్‌లో వచ్చిన స్లిప్పులను లెక్కించకపోతే ఆమరణ దీక్ష చేస్తాననీ, చచ్చినా వదిలేది లేదని హెచ్చరించారు. కేసీఆర్ తన ఫోన్లన్నీ ట్యాప్ చేయిస్తున్నారనీ, ఫోన్లో మాట్లాడాలంటే కూడా భయంగా ఉందని వాపోయారు. ‘మా గురించి చెప్పే దమ్మున్న ఛానల్, దమ్మున్న పత్రిక ఏదీ లేదు. గజ్వెల్లో లిక్కర్, డబ్బు విచ్చలవిడిగా పంచారు. పోలీసులు కూడా అధికార పార్టీ తో కుమ్మక్కయ్యారు. వారందరినీ సస్సెండ్ చేయాలి’ అని వంటేరు అన్నారు. నాలుగేళ్ల పాలనా కాలంలో సచివాలయానికి రాని ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని వంటేరు నిప్పులు చెరిగారు. సీఎంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కారణంగానే ఈసారి పోలింగ్ శాతం పెరిగిందని చెప్పారు. -
‘కేసీఆర్ మావద్ద కూలీగా పనిచేశాడు’
సాక్షి, సిద్దిపేట : తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకుని కేసీఆర్ పుణ్యానికి సీఎం అయ్యారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ అన్నారు. గజ్వేల్ మహాకూటమి అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డికి మద్దతుగా మంగళవారం ప్రజ్ఞాపూర్ నుంచి గజ్వేల్ వరకు జరిగిన రోడ్‌షోలో ఆజాద్‌తో పాటు సినీ నటి నగ్మా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆజాద్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ఏమీ లేదని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తెలంగాణలో అమలులో ఉన్న సంక్షేమ పథకాలన్నీ గతంలో కాంగ్రెస్ పార్టీ అమలుచేసిన పథకాలేనని ఆయన గుర్తుచేశారు. హైదరాబాద్‌లో బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు టీఆర్ఎస్ డమ్మీ అభ్యర్థులను పోటీలో ఉంచిందని ఆజాద్ ఆరోపించారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ కారణంగా భూములు కోల్పోయిన వారికి టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 10 శాతం మాత్రమే నష్టపరిహారం చెల్లించిందని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో మహాకూటమి 70 నుంచి 80 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతంలో తాను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌గా ఉన్న సమయంలో కేసీఆర్ తన వద్ద కూలీ మనిషిలా పనిచేశాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ డబ్బు సంపాదించుకోవడం కోసమే అధికారంలోకి వచ్చారని, మహాకూటమి ప్రజలకు సేవచేసేందుకు అధికారంలోకి రాబోతుందని ఆయన అన్నారు. ప్రజల స్పందన చూస్తుంటే గజ్వేల్‌లో ప్రతాప్‌రెడ్డి విజయం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. -
కేసీఆర్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయమని వంటేరు ఒత్తిడి
సాక్షి, గజ్వేల్ : గజ్వేల్ కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డిపై ఓ విద్యార్థి నేత డీజీపీ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. ఆపద్ధర్మ సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావులకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని ప్రతాప్ రెడ్డి తనపై ఒత్తిడి తెస్తూ.. మానసికంగా వేధిస్తున్నారని విద్యార్థి నేత సంజయ్ కుమార్ డీజీపీని ఆశ్రయించారు. గజ్వేల్ సీఎం కేసీఆర్ పోటీచేస్తున్న నియోజకర్గం కావడంతో ఈ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొద్ది రోజుల క్రితం పోలీసులు తనను వేదిస్తున్నారని వంటేరు ప్రతాప్ రెడ్డి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. అధికార టీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల్లో ప్రయోజనం కల్పించేందుకు తన ఫోన్లను పోలీసు శాఖ ట్యాపింగ్ చేస్తోందని ఆరోపిస్తూ..ఆయన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) రజత్‌కుమార్‌కు కూడా ఫిర్యాదు చేశారు. అలాంటి ఒంటేరుపై ఓ విద్యార్థినేత డీజీపీకి ఫిర్యాదు చేయడం ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. సీఎం కేసీఆర్ ఓటమే లక్ష్యంగా మహాకూటమి బరిలో నిలపిన ప్రతాప్ రెడ్డి.. గత ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలోకి దిగి కేసీఆర్‌కు గట్టి పోటీనిచ్చారు. దీంతో కేసీఆర్ కేవలం 19వేల ఓట్ల మెజార్టీతోనే విజయం సాధించారు. ఈ సారి ఎలాగైన విజయం సాధించాలని పట్టుదలతో ప్రచారం చేస్తున్నారు. మరోవైపు కేసీఆర్ గెలుపు కోసం మంత్రి హరీష్ రావు గజ్వేల్‌లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. -
కేసీఆర్‌కు వంటేరు ప్రతాప్ రెడ్డి సవాల్!
సాక్షి, హైదరాబాద్: ‘గజ్వేల్‌లో నేను ప్రచారం చేయను. కేసీఆర్ కూడా ప్రచారం చేయవద్దు. ప్రజలు ఎవరిని గెలిపిస్తారో చూద్దాం’ అని గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు. గజ్వేల్‌లో కేసీఆర్ డిపాజిట్ కోల్పోవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ఓటమి భయంతోనే హరీష్ 40 రోజులుగా గజ్వేల్ మకాం వేశారని అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డితో కలిసి వంటేరు ప్రతాప్‌రెడ్డి మంగళవారం విలేకరులతో మాట్లాడారు. తనపై కేసీఆర్ 24 కేసులు అక్రమంగా పెట్టించారని ఆరోపించారు. పోలీసులు కేసీఆర్ కుటుంబ సభ్యులు చెప్పిందే చేస్తున్నారని, హరీష్‌రావు గజ్వేల్‌లో కోట్లు వెదజల్లుతున్నారని ఆరోపించారు. ఈ విషయమై ఆధారాలతో పిర్యాదు చేసినా ఈసీ, పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. కేసీఆర్‌పై పోటీచేసే ధైర్యమా నీకు అంటూ తనను బెదిరిస్తున్నారని చెప్పారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ మాట్లాడుతూ.. గ్వజేల్ కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డి పట్ల సీఎం కేసీఆర్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గజ్వేల్‌లో స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు జరిగే పరిస్థితి లేదని అన్నారు. వంటేరు ప్రతాప్‌రెడ్డిపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, పోటీలో నుంచి తప్పుకోవాలని ఆయనను బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ కూడా ఇక్కడి పరిస్థితిని పట్టించుకోవడం లేదని, ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. నిష్పాక్షికంగా పనిచేయాలని ఈసీని, పోలీసులను హెచ్చరిస్తున్నట్టు ఆయన చెప్పారు. సీఎం కేసీఆర్‌కు సిగ్గులేదని విమర్శించారు. -
వంటేరు ప్రతాప్ రెడ్డి ఆత్మహత్యాయత్నం
-
వంటేరు ప్రతాప్ రెడ్డి ఆత్మహత్యాయత్నం
సాక్షి, హైదరాబాద్ : గజ్వేల్ కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి నివాసంలో అర్థరాత్రి హైడ్రామా నెలకొంది. కొంపల్లిలోని తన నివాసానికి సోదాల పేరుతో పోలీసులు రావడంతో తనన వేధిస్తున్నారంటూ వారి ముందే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేశారు. దీంతో అర్థరాత్రి ఆయన నివాసంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రతాప్ రెడ్డి ఇంటిని పోలీసులు ముట్టడించడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున ఆయన నివాసానికి చేరుకున్నారు. పోలీసులు తనన ఇంటి నుంచి బయటకు రాకుండా నిర్భందిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. (నా ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు) అరెస్ట్ వారెంట్ లేకుండా అర్థరాత్రి సమయంలో ఇంటికి ఎలా వస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రతాప్ రెడ్డిని పోలీసులు చంపేస్తారంటూ అక్కడికి చేరుకున్న ఆయన మద్దతుదారులు వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడంతో కేసీఆర్‌కు వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. కాగా సోదాలు నిర్వహించినప్పటికి ఆయన నివాసంలో ఏమీ దొరకలేదని అధికారులు ప్రకటించారు. పోలీసులు, ఎన్నికల అధికారుల తీరు మారకపోతే తాను ఆత్మబలిదానం చేసుకుంటానని సోమవారమే ఆయన హెచ్చరించిన విషయం తెలిసిందే. -
వెంటిలేటర్‌పై కాంగ్రెస్.. అందుకే ఒంటేరు డ్రామాలు!
సాక్షి, సిద్దిపేట: టీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఒంటేరు ప్రతాపరెడ్డి హైడ్రామాలు ఆడుతున్నారని టీఆర్ఎస్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. ఆదివారం ఎన్నికల సంఘం ముందు ఒంటేరు ఆడిన డ్రామాలు చూస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్ మీద ఆధారపడినట్టు స్పష్టమవుతోందన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఒంటేరు తీరును తీవ్రంగా తప్పుబట్టారు. తెలంగాణలో ఎన్నికల కోసం ఆంధ్రా నుంచి లక్షల రూపాయలు వస్తున్నాయని, ఆదివారం పట్టుబడిన డబ్బులు కూడా అందులోనివేనని అన్నారు. పట్టుబడిన డబ్బులకు టీఆర్ఎస్ చెందినవి అనడం హాస్యాస్పదమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ని ఓడించడం కోసమే కూటమి కట్టారని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీకి ప్రజాదరణ పెరగటంతో సభ్యత సంస్కారం లేకుండా బూటకపు ధర్నా చేశారని దుయ్యబట్టారు. డిసెంబర్ 12న టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నర్సారెడ్డి, ప్రతాపరెడ్డి లు ఎక్కడికి పారిపోతారో తేల్చుకోవాలని ధ్వజమెత్తారు. ప్రజలను మభ్యపెట్టె చిల్లర రాజకీయాలు చేయవద్దని అన్నారు. -
ఆత్మ బలిదానం చేసుకుంటా : వంటేరు
సాక్షి, హైదరాబాద్ : మంత్రి హరీష్ రావు అక్రమంగా సంపాదించుకున్న ఆస్తులంటిని బయటపెడతానని గజ్వేల్ మహాకూటమి అభ్యర్థి వంటేరు ప్రతాపరెడ్డి అన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌లో ఉన్న వేలకోట్ల రూపాయలను పోలీసులు ఎందుకు సీజ్ చేయ్యట్లేదని ఆయన ప్రశ్నించారు. పోలీసులు, ఈసీ అధికారులు తనను వేధిస్తున్నారంటూ ప్రతాప్ రెడ్డి నిన్న రిటర్నింగ్ అధికారి వద్ద నిరసనకు దిగిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు, ఎన్నికల అధికారులు తనన వేధిస్తున్నారని, వారి తీరులో మార్పు రాకుంటే గజ్వేల్ ఆర్వో కార్యాలయం ముందు ఆత్మ బలిదానం చేసుకుంటానని వంటేరు హెచ్చరించారు. ప్రజా సమస్యలపై ఇరవై ఏళ్లుగా పోరాడుతున్న తనపై కేసీఆర్ సీఎం అయ్యాక తనపై 27 కేసులు పెట్టించారని ప్రతాప్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీసులు ప్రజలను కాపాడటానికి ఉన్నారా లేక టీఆర్ఎస్ నేతల కోసం పనిచేయడాని ఉన్నారా అని మండిపడ్డారు. ప్రజలందర్నీ భయబ్రాంతులకు గురిచేస్తూ హరీష్ రావు గల్లీ లీడర్ అయ్యాడని.. గజ్వేల్‌లో కేసీఆర్‌ను గెలిపించేందుకు ఇప్పటికే 50 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. భ్రఘ్ట పట్టిన రాజకీయాలను ప్రక్షాళన చేయడానికి తన ప్రాణమైన త్యాగం చేస్తానని ఆయన అన్నారు. నాలుగున్నరేళ్లు అధికారంలో ఉన్న హరీష్‌కు అన్ని ఆస్తులు ఎలా వచ్చాయని.. ఆయనకు 2001 నాటి రబ్బర్ చెప్పులు వచ్చేలా చేస్తానని ధ్వజమెత్తారు. తనకున్న ఆస్తులన్నీ అమ్ముకున్నాని, చనిపోతే బొంద పెట్టడానికి కూడా సొంత జాగా లేదని ఆయన ఆవేదన చెందారు. -
రాహుల్ గాంధీతో హరీష్ రావు టచ్‌లో ఉన్నారు
-
రాహుల్‌తో టచ్‌లో హరీశ్‌రావు..!
సాక్షి, మెదక్ : అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. దాదాపు అన్ని ప్రధాన పార్టీలు ప్రచార ఉధృతిని పెంచేశాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు హోరెత్తుతున్నాయి. గజ్వేల్‌లో ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి ఒంటేరు ప్రతాప్‌రెడ్డి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాజాగా ఆయన మంత్రి హరీశ్‌రావును ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో హరీశ్‌రావు టచ్‌లో ఉన్నారని ఆయన అన్నారు. టీఆర్ఎస్లో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయని, ఏ క్షణంలో ఏదైనా జరగవచ్చునని ఆయన చెప్పుకొచ్చారు. -
టీడీపీకి వంటేరు ప్రతాప్‌రెడ్డి గుడ్‌బై
సాక్షి, గజ్వేల్: టీడీపీకి ఆ పార్టీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు, గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి రాజీనామా చేశారు. శనివారం పట్టణంలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రతాప్‌రెడ్డి తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా రాజీనామా పత్రంపై సంతకం చేసి.. పార్టీ అధినేత చంద్రబాబుకు పంపారు. ప్రతాప్‌రెడ్డి 2009 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తూంకుంట నర్సారెడ్డిపై, 2014 ఎన్నికల్లో గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్‌పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం టీడీపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. మల్లన్నసాగర్ బాధితులకు అండగా పోరాటం, ఓయూలో విద్యార్థి మురళి ఆత్మహత్యకు పాల్పడిన సందర్భంగా బాధిత కుటుంబానికి అండగా నిలిచిన సందర్భంలో ప్రభుత్వం తనపై కక్ష గట్టి అక్రమ కేసులతో జైలుకు పంపిందని, అయితే ఈ పోరాటాల్లో టీడీపీ తెలంగాణ నాయకత్వం తనకు అండగా నిలవకపోవడంతో దిగ్భ్రాంతికి గురయ్యానని రాజీనామా లేఖలో పేర్కొన్నారు. మరో వారంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరేందుకు ప్రతాప్‌రెడ్డి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. -
ప్రధానిని తప్పుదోవ పట్టిస్తున్న కేసీఆర్
వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శ సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు ప్రధాని మోదీని సన్నాసి అన్న సీఎం కేసీఆర్ ఇప్పుడు ఆయన దగ్గర మోకరిల్లుతున్నారని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు వంటేరు ప్రతాప్‌రెడ్డి ఎద్దేవా చేశారు. వివిధ అంశాల్లో వైఫల్యం చెందిన కేసీఆర్ చివరకు ప్రధానిని సైతం తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. పార్టీ నేత అమర్‌నాథ్‌బాబుతో కలసి ఆయన ఎన్టీఆర్భవన్లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో డబుల్ బెడ్రూం ఇళ్లు, ఆకాశ హర్మ్యాలు, ప్రత్యేక దవాఖానాలు, కే జీ టు పీజీ, ఉద్యోగాలు తదితర హామీలన్నీ ఎటుపోయాయని నిలదీశారు. మల్లన్నసాగర్లో రైతులను భయబ్రాంతులకు గురిచేస్తూ అక్రమ కేసులు పెట్టారని, లాఠీలు, తూటాలు ప్రయోగించారన్నారు. రాజకీయాలు, మీడియాను కేసీఆర్ ఏ విధంగా భ్రష్టు పట్టించారో ప్రధాని దృష్టికి తీసుకెళ్తామని అమర్‌నాథ్‌బాబు చెప్పారు. -
జెడ్పీ పీఠం కోసం పావులు కదుపుతున్న కాంగ్రెస్, టీఆర్ఎస్
సాక్షి, సంగారెడ్డి: జిల్లా పరిషత్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓటరు ఇచ్చిన విలక్షణ తీర్పుతో ఈ రెండు పార్టీలు చెరో 21 జెడ్పీటీసీ స్థానాలను నెగ్గి సమ ఉజ్జీలుగా నిలిచిన విషయం తెలిసిందే. జిల్లాలో 46 జెడ్పీటీసీ స్థానాలుండగా.. పాలకవర్గం ఎంపిక కోసం కనీసం 24 మంది సభ్యుల మద్దతు అవసరం. టీడీపీ కేవలం 4 స్థానాలను దక్కించుకున్నప్పటికీ.. జెడ్పీ చైర్మన్ ఎన్నికలో ఆ పార్టీ సభ్యుల మద్దతు కీలకంగా మారింది. ఆ పార్టీ గెలిచిన 4 స్థానా ల్లో మూడు గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనే ఉండడంతో .. జెడ్పీ చైర్మన్ ఎన్నికలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి నిర్ణయం కీలకంగా మారింది. ఈ విషయంలో వంటేరు సూచనలనే టీడీపీ అధిష్టానం పరిగణలోకి తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో జెడ్పీ చైర్మన్ ఎంపికలో ప్రతాప్‌రెడ్డి ‘కింగ్ మేకర్’గా మారారు. జెడ్పీ పాలకవర్గం ఏర్పాటు విషయంలో కాంగ్రెస్, టీఆర్ఎస్లు ‘సమ అవకాశాలు’ కలిగి ఉండడంతో.. ఇరు పార్టీల ముఖ్య నేతలు రంగంలో దిగి నేరుగా ప్రతాప్రెడ్డితోనే సంప్రదింపులు జరుపుతున్నారు. కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ బుధవారం ప్రతాప్ రెడ్డితో ఫోన్లో చర్చలు జరిపినట్లు సమాచారం. కొందరు టీఆర్ఎస్ నేతలను సైతం ప్రతాప్‌రెడ్డిని సంప్రదించి మద్దతు కోరినట్లు తెలిసింది. గజ్వేల్ అసెంబ్లీ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు గట్టి పోటీ ఇచ్చిన ప్రతాప్ రెడ్డి గెలుపుపై ధీమాతో ఉన్నారు. ఈ నెల 16న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాతే నిర్ణయాన్ని తెలుపుతానని ఆయన కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఆయన మూడు ప్రధాన డిమాండ్లను ఇరు పార్టీల నేతల ముందుంచినట్లు తెలిసింది. గజ్వేల్ నగర పంచాయతీలో ఎన్నికల్లో టీడీపీ 10 వార్డులు గెలిస్తే, టీఆర్ఎస్ 9 వార్డుల్లో, కాంగ్రెస్ ఒక వార్డులో పాగా వేసింది. చైర్మన్ స్థానాన్ని దక్కించుకోడానికి టీడీపీకి ఇంకొక సభ్యుడి మద్దతు అవసరం కాగా.. ఇక్కడ మద్దతు ఇచ్చిన పార్టీకి జెడ్పీ చైర్మన్ ఎన్నికలో సహకరిస్తామని ప్రతాప్ రెడ్డి ప్రతిపాదించినట్లు సమాచారం. గజ్వేల్ నియోజకవర్గం పరిధిలో ఆరు మండలాలున్నాయి. జగదేవ్‌పూర్, కొండపాక మండలాధ్యక్షుడి పీఠాలను దక్కించుకోడానికి కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధిస్తే.. తూప్రాన్, వర్గల్ మండల అధ్యక్షుడి పీఠాలను దక్కించుకోడానికి అవసరమైన ఎంపీటీసీ స్థానాలను టీడీపీ దక్కించుకుంది. ములుగు, గ జ్వేల్ మండలాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. ఈ రెండు మండలాల ఎంపీపీ స్థానాన్ని టీడీపీ గెలుచుకునేలా సహకరించాలని ప్రతాప్ రెడ్డి కోరినట్లు సమాచారం. జెడ్పీ వైఎస్ చైర్మన్ కుర్చీని టీడీపీకి కట్టబెట్టాలి. ఈ డిమాండ్లను నెరవేర్చే పార్టీకి జెడ్పీ చైర్మన్ ఎంపిక విషయంలో సహకరిస్తామని ప్రతాప్ రెడ్డి స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆయన బహిరంగంగా ప్రకటించకపోయినప్పటికీ.. ఆ పార్టీ వర్గాలు మాత్రం డిమాండ్ల మాట వాస్తవమేనని ధ్రువీకరిస్తున్నాయి.