
వంటేరు ప్రతాప్‌రెడ్డి (ఫైల్ ఫోటో)
సాక్షి, గజ్వేల్: టీడీపీకి ఆ పార్టీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు, గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి రాజీనామా చేశారు. శనివారం పట్టణంలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రతాప్‌రెడ్డి తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా రాజీనామా పత్రంపై సంతకం చేసి.. పార్టీ అధినేత చంద్రబాబుకు పంపారు. ప్రతాప్‌రెడ్డి 2009 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తూంకుంట నర్సారెడ్డిపై, 2014 ఎన్నికల్లో గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్‌పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
ప్రస్తుతం టీడీపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. మల్లన్నసాగర్ బాధితులకు అండగా పోరాటం, ఓయూలో విద్యార్థి మురళి ఆత్మహత్యకు పాల్పడిన సందర్భంగా బాధిత కుటుంబానికి అండగా నిలిచిన సందర్భంలో ప్రభుత్వం తనపై కక్ష గట్టి అక్రమ కేసులతో జైలుకు పంపిందని, అయితే ఈ పోరాటాల్లో టీడీపీ తెలంగాణ నాయకత్వం తనకు అండగా నిలవకపోవడంతో దిగ్భ్రాంతికి గురయ్యానని రాజీనామా లేఖలో పేర్కొన్నారు. మరో వారంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరేందుకు ప్రతాప్‌రెడ్డి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment