
సాక్షి, మెదక్ : అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. దాదాపు అన్ని ప్రధాన పార్టీలు ప్రచార ఉధృతిని పెంచేశాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు హోరెత్తుతున్నాయి. గజ్వేల్‌లో ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి ఒంటేరు ప్రతాప్‌రెడ్డి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాజాగా ఆయన మంత్రి హరీశ్‌రావును ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో హరీశ్‌రావు టచ్‌లో ఉన్నారని ఆయన అన్నారు. టీఆర్‌ఎస్‌లో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయని, ఏ క్షణంలో ఏదైనా జరగవచ్చునని ఆయన చెప్పుకొచ్చారు.