సాక్షి, హైదరాబాద్ : మంత్రి హరీష్ రావు అక్రమంగా సంపాదించుకున్న ఆస్తులంటిని బయటపెడతానని గజ్వేల్ మహాకూటమి అభ్యర్థి వంటేరు ప్రతాపరెడ్డి అన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌లో ఉన్న వేలకోట్ల రూపాయలను పోలీసులు ఎందుకు సీజ్ చేయ్యట్లేదని ఆయన ప్రశ్నించారు. పోలీసులు, ఈసీ అధికారులు తనను వేధిస్తున్నారంటూ ప్రతాప్ రెడ్డి నిన్న రిటర్నింగ్ అధికారి వద్ద నిరసనకు దిగిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు, ఎన్నికల అధికారులు తనన వేధిస్తున్నారని, వారి తీరులో మార్పు రాకుంటే గజ్వేల్ ఆర్వో కార్యాలయం ముందు ఆత్మ బలిదానం చేసుకుంటానని వంటేరు హెచ్చరించారు.
ప్రజా సమస్యలపై ఇరవై ఏళ్లుగా పోరాడుతున్న తనపై కేసీఆర్ సీఎం అయ్యాక తనపై 27 కేసులు పెట్టించారని ప్రతాప్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీసులు ప్రజలను కాపాడటానికి ఉన్నారా లేక టీఆర్‌ఎస్ నేతల కోసం పనిచేయడాని ఉన్నారా అని మండిపడ్డారు. ప్రజలందర్నీ భయబ్రాంతులకు గురిచేస్తూ హరీష్ రావు గల్లీ లీడర్ అయ్యాడని.. గజ్వేల్‌లో కేసీఆర్‌ను గెలిపించేందుకు ఇప్పటికే 50 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. భ్రఘ్ట పట్టిన రాజకీయాలను ప్రక్షాళన చేయడానికి తన ప్రాణమైన త్యాగం చేస్తానని ఆయన అన్నారు. నాలుగున్నరేళ్లు అధికారంలో ఉన్న హరీష్‌కు అన్ని ఆస్తులు ఎలా వచ్చాయని.. ఆయనకు 2001 నాటి రబ్బర్ చెప్పులు వచ్చేలా చేస్తానని ధ్వజమెత్తారు. తనకున్న ఆస్తులన్నీ అమ్ముకున్నాని, చనిపోతే బొంద పెట్టడానికి కూడా సొంత జాగా లేదని ఆయన ఆవేదన చెందారు.
Comments
Please login to add a commentAdd a comment