
సాక్షి, సిద్ధిపేట : తెలంగాణ రాజకీయాల్లో మరో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ కీలక నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి పార్టీ మారనున్నట్లు సమాచారం. రేపు(శుక్రవారం) సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, 2018లో కాంగ్రెస్ పార్టీ తరఫున గజ్వేల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రతాప్ రెడ్డి బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన ప్రత్యర్థి కేసీఆర్ చేతిలో రెండు పర్యాయాలు ఆయన ఓటమి పాలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment