ప్రధానిని తప్పుదోవ పట్టిస్తున్న కేసీఆర్ | Vanteru Pratap Reddy Criticism on kcr | Sakshi
Sakshi News home page

ప్రధానిని తప్పుదోవ పట్టిస్తున్న కేసీఆర్

Published Sat, Aug 6 2016 1:53 AM | Last Updated on Fri, Aug 24 2018 2:17 PM

ప్రధానిని తప్పుదోవ పట్టిస్తున్న కేసీఆర్ - Sakshi

ప్రధానిని తప్పుదోవ పట్టిస్తున్న కేసీఆర్

వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శ
సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు ప్రధాని మోదీని సన్నాసి అన్న  సీఎం కేసీఆర్ ఇప్పుడు ఆయన దగ్గర మోకరిల్లుతున్నారని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు వంటేరు ప్రతాప్‌రెడ్డి ఎద్దేవా చేశారు. వివిధ అంశాల్లో వైఫల్యం చెందిన కేసీఆర్ చివరకు ప్రధానిని సైతం తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. పార్టీ నేత అమర్‌నాథ్‌బాబుతో కలసి ఆయన ఎన్టీఆర్‌భవన్‌లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో డబుల్ బెడ్‌రూం ఇళ్లు, ఆకాశ హర్మ్యాలు, ప్రత్యేక దవాఖానాలు, కే జీ టు పీజీ, ఉద్యోగాలు తదితర హామీలన్నీ ఎటుపోయాయని నిలదీశారు.

మల్లన్నసాగర్‌లో రైతులను భయబ్రాంతులకు గురిచేస్తూ అక్రమ కేసులు పెట్టారని, లాఠీలు, తూటాలు ప్రయోగించారన్నారు. రాజకీయాలు, మీడియాను కేసీఆర్ ఏ విధంగా భ్రష్టు పట్టించారో ప్రధాని దృష్టికి తీసుకెళ్తామని అమర్‌నాథ్‌బాబు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement