సిద్దిపేటను జిల్లా కేంద్రంగా మారుస్తా: కేసీఆర్ | Siddipeta will be developed District headquarters, says KCR | Sakshi
Sakshi News home page

సిద్దిపేటను జిల్లా కేంద్రంగా మారుస్తా: కేసీఆర్

Published Mon, Nov 4 2013 12:58 PM | Last Updated on Wed, Aug 15 2018 9:17 PM

సిద్దిపేటను జిల్లా కేంద్రంగా మారుస్తా: కేసీఆర్ - Sakshi

సిద్దిపేటను జిల్లా కేంద్రంగా మారుస్తా: కేసీఆర్

మెదక్ : తన చర్మం ఒలిచి చెప్పులు కుట్టించుకున్నా సిద్ధిపేట ప్రజల రుణం తీర్చుకోలేనని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అన్నారు. సిద్ధపేట పర్యటనలో భాగంగా ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిద్ధిపేటను జిల్లా కేంద్రంగా మారుస్తామన్నారు. హైదరాబాద్తో సమానంగా సిద్ధిపేటను అభివృద్ధి చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి సాగునీటిని అందిస్తామని, అలాగే ప్రత్యేక రైల్వే లైన్ ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement