
పాటల సీడీ ఆవిష్కరణ కార్యక్రమం
సిద్దిపేట జోన్: బుధవారం మంత్రి హరీశ్‌రావు స్వగృహంలో బుధవారం జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ పాటల సీడీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు మరుపల్లి శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ జాగృతి జిల్లా కన్వీనర్ శ్రీధర్‌రావు మాట్లాడారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ విశిష్టతను దేశ విదేశాల్లో చాటి చెప్పిన ఘనత తెలంగాణ జాగృతికి దక్కుతుందన్నారు. కార్యక్రమంలో మంత్రి వ్యక్తిగత సహాయకులు రాంచందర్‌రావు, ఎర్రవల్లి సర్పంచ్ బాల్‌రాజు, గుర్రాలగొంది సర్పంచ్ ఆంజనేయులు జాగృతి నాయకులు సూరి, వవన్ తదితరులు పాల్గొన్నారు.