వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్న ట్రాఫిక్ ఏసీపీ బాలాజీ
గజ్వేల్ సిద్ధిపేట: గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో పార్కింగ్ సమస్యలు, ట్రాఫిక్ నియంత్రణపై అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నెల 1న ‘సాక్షి’లో ‘గజ్వేల్...గజిబిజి’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించిన సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ బాలాజీ గురువారం ఇక్కడ పర్యటించారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ సమస్యలను, రాంగ్ పార్కింగ్ పరిస్థితిని పరిశీలించారు. మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్ చౌరస్తా, గజ్వేల్ పట్టణంలోని ఇందిరాపార్క్ చౌరస్తా, ఆంధ్రాబ్యాంక్ వద్ద అడ్డదిడ్డంగా పెట్టిన ద్విచక్ర వాహనదారులను, ఆటోడ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలు, రాంగ్ పార్కింగ్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బస్టాండ్ వద్ద రోడ్డుపై పార్కింగ్ లేని ప్రాంతాల్లో వాహనాలను నిలపకూడదన్నారు. ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, ఇన్సూరెన్స్ పొల్యూషన్ పత్రాలు కలిగి ఉండాలని..వాహనానికి సంబంధించి ధ్రువపత్రాలు లేకుండా ఎవరైనా వాహనం నడిపితే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆటోలను రోడ్డుపై నిలపడం వల్ల ఇతర వాహనాలు రోడ్డుపై నిలిచి ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందన్నారు. ఆటోలను రోడ్డు కింద ఆపాలన్నారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ.. డ్రైవింగ్ చేయవద్దని, మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు.
రాంగ్ పార్కింగ్ చేసిన వారిపై 20కేసులు నమోదు చేసి రూ. 3750 జరిమానా విధించినట్లు తెలిపారు. గజ్వేల్ ట్రాఫిక్ ఎస్‌ఐ ఆనంద్‌గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment