
సీఎం చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న రమణాచారి
- కేసీఆర్ చేతుల మీదుగా ‘హరితమిత్ర’
- అవార్డు అందుకున్న కమిషనర్
సిద్దిపేట జోన్: ‘సిద్దిపేట పనితీరు బాగుంది. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగండి’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టణ ప్రగతిపై మున్సిపల్ కమిషనర్‌కు కితాబిచ్చారు. సోమవారం హైదరాబాద్‌లోని గోల్కోండ కోటలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో సీఎం కేసీఆర్ హరితమిత్ర అవార్డును సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ రమణాచారికి అందజేశారు. మూడేళ్లుగా మంత్రి హరీశ్, ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ ప్రాంతంలో 5 లక్షల మొక్కలను నాటి హరితహారానికే ఆదర్శంగా నిలిచినందున రాష్ట్ర స్థాయిలో ఈ అవార్డు సిద్దిపేటకు దక్కింది. ఈ మేరకు కేసీఆర్ రూ.2 లక్షల నగదు, ప్రశంసాపత్రాన్ని అందజేశారు.