చిన్నకోడూరు: బీజేపీ జిల్లా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం శనివారం సిద్దిపేట పట్టణంలోని వీఏఆర్ గార్డెన్‌లో నిర్వహిస్తున్నట్లు బీజేఎంఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబడిపల్లి శ్రీనివాస్, బీజేపీ మండల అధ్యక్షుడు జంగం బాలాకర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం వారు మాట్లాడుతూ ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, జిల్లా అధ్యక్షులు కాసాల బుచ్చిరెడ్డితోపాటు రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొంటారని పేర్కొన్నారు. సమావేశంలో ప్రధాని మోదీ పర్యటనతోపాటు పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించడం జరుగుతుందన్నారు. సమావేశానికి పార్టీ శ్రేణులు సకాలంలో హాజరుకావాలని కోరారు.