ఓటు వేసేందుకు హెలికాఫ్టర్‌లో వెళ్లిన కేసీఆర్ | KCR couple cast their vote in chintamadaka | Sakshi
Sakshi News home page

ఓటు వేసేందుకు హెలికాఫ్టర్‌లో వెళ్లిన కేసీఆర్

Published Wed, Apr 30 2014 10:25 AM | Last Updated on Thu, Aug 16 2018 1:18 PM

ఓటు వేసేందుకు హెలికాఫ్టర్‌లో వెళ్లిన  కేసీఆర్ - Sakshi

ఓటు వేసేందుకు హెలికాఫ్టర్‌లో వెళ్లిన కేసీఆర్

మెదక్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ బుధవారం ఓటు వేసేందుకు తన ఫామ్ హౌస్ నుంచి హెలికాఫ్టర్లో బయల్దేరారు. సిద్ధిపేట నియోజకవర్గం చింతమడకలో ఆయన ఓటు వేశారు. కేసీఆర్ సతీమణి కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎంపీగా మెదక్ నుంచి కేసీఆర్ పోటీ చేస్తున్నారు. ఇక  సిద్ధిపేటలో టీఆర్ఎస్ తరపున హరీష్ రావు బరిలో ఉన్నారు.

కాగా కేసీఆర్ ఫిబ్రవరి 17,  1954న మెదక్ జిల్లా సిద్ధిపేట మండలం చింతమడకలో జన్మించారు. ప్రారంభంలో తెలుగుదేశం పార్టీలో ఉంటూ కొంతకాలం డిప్యూటి స్పీకరుగా పదవి నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నేపథ్యంతో తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement