
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావును ఎస్‌బీఐ అధికారులు వినూత్న రీతిలో సన్మానించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన హరీశ్‌రావుకు బ్యాంకు అధికారులు.. ఆయన పుట్టిన రోజు అంకెలైన 030672.. సీరియల్ నంబర్‌తో ఉన్న మూడు కరెన్సీ నోట్లను మెమెంటోగా అమర్చి బహూకరించారు.
రూ.100, రూ.50, రూ.20 నోట్లు ఇందులో ఉన్నాయి. అలాగే మంత్రి గురువారం పుట్టిన రోజు జరుపుకున్న నేపథ్యంలో ఆయన ఫొటోతో కూడిన పోస్టల్ స్టాంపులను కూడా అందించి సత్కరించారు.
చదవండి: కరోనాతో ప్రాణం పోయింది.. అప్పు మిగిలింది



Comments
Please login to add a commentAdd a comment