
మహిళ టీచర్ల నిరసన ర్యాలీ
సిద్దిపేట జోన్: డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మహిళ ఉపాధ్యాయులను కించపర్చేలా వ్యాఖ్యాలు చేశారంటూ బుధవారం రాత్రి సిద్దిపేటలో మహిళ టీచర్లు స్థానిక పాత బస్టాండ్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంత మహిళ ఉపాధ్యాయుల సంఘం అద్వర్యంలో వెంకటేశ్వరాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు ఉదయరాణి, సుకన్య, సాయిశ్రీ, సౌజన్య, సరళ, యాదమ్మ, శోభరాణి, శ్రీవాణి, అనిత, ఆరుణ, విజయ, స్వాతి, పద్మ, మాదవి, యశోద, తదితరులు పాల్గొన్నారు.