
నూజివీడు ట్రిపుల్ ఐటీలో విషాదం
నూజివీడు(కృష్ణాజిల్లా): ప్రతిష్టాత్మక ట్రిపుల్ ఐటీ విద్యాసంస్థలో విషాదం చోటుచేసుకుంది. ఇక్కడ చదువుకొంటున్న ఓ విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్థానిక ట్రిపుల్ ఐటీ హాస్టల్‌లో ఉంటున్న వీణ బుధవారం రాత్రి తన గదిలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకొంది. గురువారం ఆమె గది తలుపు తీయకపోవడంతో.. తోటి విద్యార్థినులు కిటికీ నుంచి చూసి కళాశాల యాజమాన్యానికి విషయం తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తలరించారు. వీణ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదుచేసుకొనిఽ దర్యాప్తు చేస్తున్నారు.