girls students
-
బడిలో ‘బైలింగ్యువల్’ భళా!
గుంటూరు చౌత్ర సెంటర్లోని ప్రభుత్వ బాలికల ఉర్దూ ఉన్నత పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకు 545 మంది విద్యార్థినులు చదువుతున్నారు. గతేడాదితో పోలిస్తే 40 మంది పెరిగారు. ప్రవేశాలు ఇంకా నమోదవుతున్నాయి. గతంలో ఇక్కడ ఉర్దూ మీడియం మాత్రమే ఉండగా ఇప్పుడు ఇంగ్లిష్‌లోనూ బోధిస్తున్నారు. పాఠ్య పుస్తకాలు ఇంగ్లి ష్–ఉర్దూలో ఉండడంతో ఆంగ్ల భాషను సులభంగా ఆకళింపు చేసుకుంటున్నారు. నగరంలోని రెండు ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలల్లో ఇదే పరిస్థితి. ఇటీవల ప్రభుత్వం సమకూర్చిన ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ల ద్వారా మరింత మెరుగ్గా బోధన కొనసాగుతోంది. గుంటూరు నుంచి నానాజీ అంకంరెడ్డి, సాక్షి ప్రతినిధి:సంస్కరణలు చేపట్టి విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తెలుగేతర మాతృభాష విద్యార్థులు సైతం చదువుల్లో రాణించేలా బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలను రూపొందించింది. రెండో అధికార భాషకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ 5,286 ఉర్దూ మీడియం పాఠశాలల్లో చదువుతున్న 62,777 మంది విద్యార్థులకు బైలింగ్యువల్ టెక్ట్స్ బుక్స్‌ను సమకూర్చింది. రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని స్కూళ్లలో చదివే విద్యార్థుల సౌలభ్యం కోసం కన్నడ, తమిళం, ఒడియా భాషల్లో బైలింగ్యువల్ పుస్తకాలను ముద్రించి అందిస్తోంది. నాలుగు మైనర్ భాషల్లో 85,469 మంది బడికెళ్లే వయసున్న ప్రతి చిన్నారి చదువుకోవాలన్న సంకల్పంతో తెలుగేతర మాతృభాషల విద్యార్థులను సైతం రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తమిళం మాతృభాషగా ఉన్న 1,316 మంది విద్యార్థుల కోసం బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలను ముద్రించారు. ఒడియా మాధ్యమంలో 8,599 మంది, కన్నడలో 10,485 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆరు నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న వీరి కోసం కూడా ప్రభుత్వం బైలింగ్యువల్ టెక్ట్స్ బుక్స్ అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉర్దూ, కన్నడ, ఒడియా, తమిళం భాషల్లో 85,469 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. దేశంలో మైనర్ భాషల్లో బైలింగ్యువల్ టెక్ట్స్ బుక్స్‌ను అందుబాటులోకి తెచ్చిన ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కేంద్ర విద్యాశాఖ ప్రశంసలు అందుకుంది. కచ్చితంగా మెరుగైన ఫలితాలు.. గతంలో సైన్స్ పాఠం ఎన్నో ఉదాహరణలతో చెప్పినా చాలామందికి అంతుబట్టేది కాదు. విద్యార్థులు ఎవరికి తోచినట్లు వారు ఊహించుకునేవారు. ఇప్పుడు ఐఎఫ్‌పీ స్క్రీన్లు వచ్చాక ప్రతి అంశాన్ని విపులంగా ఆడియో, వీడియో రూపంలో చెప్పగలుగుతున్నాం. విద్యార్థులు బాగా అర్థం చేసుకుంటున్నారు. కచ్చితంగా మెరుగైన ఫలితాలు వస్తాయి. మౌలిక సదుపాయాల విషయంలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తెచ్చింది. గతంలో మరుగుదొడ్లు లేక బాలికలు చదువులకు దూరమైన సందర్భాలున్నాయి. ఇప్పుడు అన్ని వసతులు ఉండడంతో గౌరవంగా చదువుకుంటున్నారు. – డి.యల్లమందరావు (ఫిజిక్స్ ఉపాధ్యాయుడు), ప్రభుత్వ బాలికల ఉర్దూ ఉన్నత పాఠశాల, గుంటూరు వేగంగా అద్భుతమైన మార్పులు.. గతంలో ఉర్దూ మీడియం విద్యార్థులు అదే భాషలో రాసేవారు. ఇప్పుడు బైలింగ్యువల్ పుస్తకాలు ఉర్దూ–ఇంగ్లిష్‌లో ఉండడంతో బోధన, అర్థం చేసుకోవడంలో చాలా మార్పులు వచ్చాయి. ఇటీవల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడంతో ప్రతి అంశాన్ని చక్కగా గ్రహించి ఇంగ్లిష్‌లోనే నోట్స్ రాస్తున్నారు. తక్కువ సమయంలోనే అద్భుతమైన మార్పు వచ్చింది. – అబ్దుల్ కయ్యూమ్, మ్యాథ్స్ ఉపాధ్యాయుడు, ప్రభుత్వ బాలికల ఉర్దూ ఉన్నత పాఠశాల, గుంటూరు ఇప్పుడెంతో బాగుంది.. మా ఇంట్లో మాకంటే ముందు చదువుతున్న వారు పుస్తకాలు కొనేందుకు చాలా ఇబ్బంది పడేవారు. మాకు అలాంటి పరిస్థితి లేదు. బ్యాగు నుంచి పుస్తకాలు, యూనిఫారం వరకు అన్నీ ప్రభుత్వమే ఇస్తోంది. మధ్యాహ్నం మంచి భోజనం పెడుతున్నారు. వాష్‌రూమ్‌లు పరిశుభ్రంగా ఉన్నాయి. బడిలో దేనికీ లోటు లేదు. కొత్తగా ఐఎఫ్‌పీ స్క్రీన్లతో పాఠాలు చెప్పడం ఎంతో బాగుంది. – మహ్మద్ తనాజ్, పదో తరగతి విద్యార్థిని, ప్రభుత్వ బాలికల ఉర్దూ ఉన్నత పాఠశాల, గుంటూరు -
వామ్మో ఇదేం ఫైటింగ్.. బస్టాండ్‌లో తన్నుకున్న విద్యార్థినులు
సాక్షి, చెన్నై: బస్టాండ్‌లో విద్యార్థినులు తన్నుకున్నారు. మగరాయుళ్లకు ఏమాత్రం తీసి పోమన్నట్టుగా సినీ స్టంట్లు చేశారు. విద్యార్థులు వ్యవహరిస్తున్న తీరుతో కౌన్సెలింగ్‌కు తగ్గ చర్యలపై విద్యా శాఖ దృష్టి పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల తీరు వివాదాలకు, చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. తిరునల్వేలిలో విద్యార్థుల గొడవలో ఓ విద్యార్ధి మరణాన్ని విద్యాశాఖ తీవ్రంగా పరిగణించింది. ఆ విద్యార్థి చదువుతున్న పాఠశాలలోని ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలాగే, కడలూరులో శుక్రవారం గొడవ పడ్డ 14 మంది విద్యార్థుల పై కేసులు నమోదు అయ్యాయి. ఈ పరిస్థితుల్లో శనివారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో విద్యార్థినులు తగ్గేదేలేదన్నట్టుగా గొడవ పడిన వీడియో రాత్రి సమయంలో వైరల్‌గా మారింది. స్టంట్లతో మదురై పెరియార్ టౌన్ బస్టాండ్‌లో పదుల సఖ్యలో రెండు గ్రూపులుగా విడిపోయిన విద్యార్థులు హఠాత్తుగా ముష్టియుద్ధానికి దిగారు. తన్నులు తాళ లేక కొందరు పారిపోతున్నా, వెంటాడి మరీ మరి కొందరు విద్యార్థినులు కొట్టడం గమనార్హం. ఈ దృశ్యాలన్నింటినీ అక్కడే ఉన్న విద్యార్థులు తమ మొబైల్ కెమెరాల్లో బంధించారు. అక్కడి ప్రయాణికులు వారిస్తున్నా, పట్టించుకోకుండా విద్యార్థినులు సాగించిన ఫైట్ దిగ్భ్రాంతి కలిగించింది. అర్ధ గంట తర్వాత రంగంలోకి పోలీసులు దిగడంతో విద్యార్థినులు పత్తా లేకుండా పోయారు. అయితే, విద్యార్థులు చిత్రీకరించిన వీడియో రాత్రి సమయంలో వైరల్‌గా మారింది. విద్యార్థినుల ఫైట్‌ను ప్రోత్సహించే విధంగా మరి కొందరు విద్యార్థులు ఈల గోల చేయడం వంటి దృశ్యాలు వీడియోలో ప్రత్యక్షం అయ్యాయి. ఈ ఘటనను విద్యాశాఖ తీవ్రంగా పరిగణించింది. అక్కడ తన్నుకున్న విద్యారి్ధనులు అందరూ సమీపంలోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన వారిగా గుర్తించారు. ఈఘటనపై సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. వీరికి కౌన్సెలింగ్‌కు ఇవ్వడానికి విద్యాశాఖ అధికారులు సిద్ధమయ్యారు. என்ன நடக்குது தமிழ்நாட்டுல?? பள்ளிக்கூட மாணவிகள் மதுரை பேருந்து நிலையத்தில்,,,,! நடந்த அடிதடி! ரவுடிசம் பெருகும் சூழல்!!! pic.twitter.com/TQvSfZSiyk — மணவை S.செல்வராஜ் AHMA, BA,,, (@Selva_AIADMK) May 1, 202 ఇది కూడా చదవండి: చిన్నారి కన్నీళ్లు తుడిచేవారెవరు? -
మాట తప్పిన తాలిబన్లు.. షాకింగ్ నిర్ణయంతో ఆవేదనలో బాలికలు
కాబూల్: తాలిబన్లు మరోసారి మాట తప్పారు. ప్రపంచ దేశాలు తమ వైపు వేలెత్తి చూపించేలా షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. బాలికలు హైస్కూల్ విద్యను అభ్యసించేందుకు అనుమతించట్లేదని ప్రకటించడంతో మరోసారి వార్తల్లో నిలిచారు. కాగా, ఈ ఏడాది విద్యాసంవత్సరం ప్రారంభంలో బాలికలను హైస్కూల్ విద్యకు కూడా అనుమతిస్తున్నట్లు తాలిబన్లు కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు. తీరా స్కూల్స్ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే తమ నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్టు షాకిచ్చారు. అయితే, ప్రపంచ దేశాలు తమ ప్రభుత్వాన్ని గుర్తించేందుకు వీలుగా పలు సంస్కరణలు చేపడుతున్నట్లు గతంలో ప్రకటించారు. ఇందులో భాగంగానే బాలికలకు ఉన్నత చదువులు అందించేందుకు కూడా అనుమతిస్తున్నట్లు చెప్పారు. కానీ మళ్లీ మాట మార్చుతూ బాలికలను చదువుకు దూరం చేశారు. బాలికలకు ఉన్నత విద్య అభ్యసించేందుకు అనుమతించట్లేదని.. ఆరవ తరగతి వరకే పరిమితం చేస్తున్నట్లు చెప్పారు. దీంతో బాలికలు ఆవేదనకు గురవుతున్నట్టు సమాచారం. అయితే, ఇందుకు కారణం గ్రామీణ ప్రజలేనని తాలిబన్లు ఆరోపిస్తున్నారు. గ్రామీణ ప్రాంత, గిరిజన ప్రాంతాల్లో ఉన్న వారు తమ పిల్లలను స్కూల్స్‌కు పంపేందుకు అంగీకరించడంలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బాలికలకు ఉన్నత విద్యను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు.. తాలిబన్లు అధికారం చేపట్టిన నాటి నుంచి సీనియర్ నేతల మధ్య విబేధాలు భగ్గుమంటున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మహిళ స్వేచ్చ పట్ల ఆంక్షలు ఉండాలని, కఠినంగా వ్యవహరించాలని సీనియర్లు కోరుతుండగా.. స్వేచ్చ అవసరమంటూ మరికొందరు పట్టుబడుతున్నట్టు సమాచారం. -
నూజివీడు ట్రిపుల్ ఐటీలో విషాదం
నూజివీడు(కృష్ణాజిల్లా): ప్రతిష్టాత్మక ట్రిపుల్ ఐటీ విద్యాసంస్థలో విషాదం చోటుచేసుకుంది. ఇక్కడ చదువుకొంటున్న ఓ విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్థానిక ట్రిపుల్ ఐటీ హాస్టల్లో ఉంటున్న వీణ బుధవారం రాత్రి తన గదిలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకొంది. గురువారం ఆమె గది తలుపు తీయకపోవడంతో.. తోటి విద్యార్థినులు కిటికీ నుంచి చూసి కళాశాల యాజమాన్యానికి విషయం తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తలరించారు. వీణ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదుచేసుకొనిఽ దర్యాప్తు చేస్తున్నారు. -
ఉపాధ్యాయుల వేధింపులపై డెప్యూటీ సీఎంకు ఫిర్యాదు
గోవర్ధనగిరి పాఠశాలను తనిఖీ చేసిన డీఈవో హుస్నాబాద్‌రూరల్: చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులు విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని గ్రామానికి చెందిన కొందరు డెప్యూటీ సీఎంకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో ఏజేసీ అదేశాల మేరకు డీఈవో శ్రీనివాసాచార్యులు సోమవారం హుస్నాబాద్ మండలం గోవర్ధనగిరి పాఠశాలను తనిఖీ చేశారు. సర్పంచ్ పాక శ్రీనివాస్, ఎంపీటీసీ పెండ్యాల రమ సమక్షంలో విచారణ చేపట్టారు. అలాంటివి ఏమి లేవని, వారం రోజుల క్రితం 9వ తరగతి విద్యార్థినిని ఉపాధ్యాయుడు వేధించాడని సమాచారంతో అమ్మాయి తండ్రి సమక్షంలోనే మందలించి వదిలేసినట్లు తెలిపారు. అంతకుమించి ఎలాంటి సమస్యలు లేవని ప్రజాప్రతినిధులు లిఖితపూర్వకంగా ఇచ్చారు. విద్యార్థినులు సైతం వారి అభిప్రాయాలు రాసి ఇచ్చారు. వేధింపులకు గురైన విద్యార్థిని నుంచి అభిప్రాయం తీసుకోకుండా మధ్యహ్నం పాఠశాల నుంచి ఇంటికి పంపించి ఆమె తండ్రి అభిప్రాయం తీసుకోవడం విశేషం. గురువుల ప్రవర్తన మారాలి పాఠశాలకు వచ్చే ఉపాధ్యాయుల ప్రవర్తన మారాలని, విద్యార్థులకు విద్యా బోధనకు సమయం కేటాయించకుండా సెల్ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారని ప్రజాప్రతినిధులు డీఈవోకు వివరించారు. ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతోనే గతేడాది పదోతరగతి పలితాలు రాలేదన్నారు. విద్యార్థులను ఉపాధ్యాయుల కార్లు, వాహనాలను శుభ్రం చేయిస్తున్నారని ఆరోపించారు. హుజూరాబాద్ ఈవో ఆనందం, ఎంఈవో అర్జున్, పీజీ హెచ్ఎంలు అల్లెంకి రవీందర్, సమ్మిరెడ్డి, సర్పంచ్ పాక శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యులు పెండ్యాల రమ, ఎస్ఎంసీ చైర్మన్ సారయ్య తదితరులు ఉన్నారు. -
30 మంది విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత
ములకలపల్లి: ఖమ్మం జిల్లా ములకలపల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఆహారం విషతుల్యమైంది. దీంతో 30 మందికిపైగా విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఇక్కడి వసతి గృహంలో సుమారు 80 మంది వరకు విద్యార్థినులు ఉన్నారు. ఆదివారం సాయంత్రం వీరికి భోజనంలో వంకాయ కూర, సాంబారు వడ్డించారు. ఇది తిన్న తర్వాత తీవ్ర దగ్గు, కడుపునొప్పితో 30 మందికి పైగా విద్యార్థినులు అస్వస్థతకు లోనుకాగా సిబ్బంది వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, అస్వస్థతకు గురైన విద్యార్థినులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక జెడ్పీటీసీ సభ్యుడు బత్తుల అంజి, పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు దండి కొమరయ్య పరామర్శించారు. విద్యార్థినులను ఆస్పత్రికి తరలించడంలో సాయం అందించారు. -
అమ్మాయిల ధర్మాగ్రహం
ప్రగతినగర్: ‘‘అమ్మాయిలూ అధైర్య పడవద్దు.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి’’ అని అదనపు జాయింట్ కలెక్టర్ పి.శేషాద్రి విద్యార్థినులకు సూచించారు. ఆధునిక సమాజంలోనూ మహిళలపై ఆరాచాకాలు కొనసాగడం దారుణమన్నారు. నగరంలోని యాదగిరిబాగ్‌లో శనివారం తెల్లవారుజామున భార్యను అతి కిరాతకంగా హత్యచేసి ఆనందంతో తాండవమాడిన కిరాతకుడిని ఉరి తీయాలంటూ వివిధ కళాశాలలకు చెందిన విద్యార్ధినులు సోమవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. అక్కడే బైఠాయించారు. అంతకుముందు నగరంలోని కంఠేశ్వర్ మైదానం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కోర్టు సమీపంలోనే వీరిని పోలీసులు నిలువరించడంతో, కలెక్టర్ బయటకురావాలని నినాదాలు చేశారు. అదనపు జేసీ శేషాద్రి, డీఆర్ఓ మనోహర్, ఐసీడిఎస్ పీడీ రాములు బయటకు వచ్చి విద్యార్థినులను సముదాయించారు. యాదగిరిబాగ్‌లో జరిగిన ఘటనకు చింతిస్తున్నామని, నిందితుడిని కఠినంగా శిక్షించమని ఎస్పీని కో రామన్నారు. విద్యార్థినులు తమను తాము రక్షించుకునేలా శిక్షణ పొందాల న్నారు. మహిళలపై దాడులను నివారించేందుకు అవగాహన సదస్సులు ఏర్పా టు చేస్తామన్నారు. అన్ని కళాశాలలు, పాఠశాలలలో మహిళల రక్షణ పట్ల అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఉమెన్స్ కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతి, లెక్చరర్లు వసుంధర తదితరులు పాల్గొన్నారు.