harish rao visit
-
‘కాంగ్రెస్, బీజేపీ నేతలను చెరువులో ముంచాలి’
సాక్షి, సిద్దిపేట: కాళేశ్వరం ప్రాజెక్టు, కరెంటు సరఫరాపై విమర్శలు చేసే కాంగ్రెస్, బీజేపీ నేతలను సిద్దిపేట జిల్లా రాజగోపాల్‌పేట చెరువులో ముంచాలని వైద్య, ఆరోగ్య శాఖమంత్రి హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. ఢిల్లీ, గాంధీభవన్‌లో కూర్చుండి మాట్లాడే వారికి ఏం తెలుస్తుందంటూ బీజేపీ, కాంగ్రెస్ నాయకుల తీరుపై మండిపడ్డారు. బుధవారం సిద్దిపేట జిల్లాలోని నంగునూరు మండలం రాజగోపాల్‌పేట గంగమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామంలోని పెద్ద చెరువులో చేప పిల్లలను వదిలారు. పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఇవాల చేపలను వదిలాం. కానీ గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చెరువులో నీళ్లు గుంజుకుపో యేవి. బోర్లు వేసి, మోటార్లు పెట్టి, ట్రాన్స్ ఫార్మర్ పెట్టి చెరువులు నింపేవారం’ అని నాటి రోజులను గుర్తు చేశారు. నేడు కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని కాలంతో పని లేకుండా.. సీఎం కేసీఆర్ దయతో చెరువులు నిండుగా ఉన్నాయన్నారు. దేశంలో రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు ఇచ్చింది కేవలం కేసీఆర్ ఒక్కరేనని చెప్పారు. ‘ఒకప్పుడు యాసంగిలో నీళ్లు లేక, బోర్లు ఎండిపోయి, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేవని, కానీ ఇప్పుడు ఆ రోజులు మారిపోయి సీన్ రివర్స్ అయిందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలకు ఇదంతా కనపడటం లేదని హరీశ్ ఎద్దేవా చేశారు. ఇదీ చదవండి: గోదావరి బోర్డుకు కాళేశ్వరం సవరణ డీపీఆర్! -
ఇళ్లకు ఇక 24 గంటల విద్యుత్: హరీష్ రావు
లింగంపేట(నిజామాబాద్) : తెలంగాణ రాష్ట్రంలో గృహావసరాలకు ఇక రోజుకు 24 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం కాకతీయ మిషన్‌లో భాగంగా హరీష్‌రావు చెరువులను పరిశీలించారు. శుక్రవారం నిజామాబాద్‌లో పర్యటించిన మంత్రి పలు మండలాల్లోని చెరువుల పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి హరీష్‌రావు నిజామాబాద్ జిల్లా లింగపేట మండలంలోని మల్లారం చెరువును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. జిల్లాలోని లింగంపేట, తాడవాయి, గాంధారీ మండలంలోని చెరువులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రానున్న రెండేళ్లలో రైతులకు 12 గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తామని చెప్పారు. -
అటకెక్కిన ఆధునికీకరణ..
- అధ్వానస్థితిలో పిల్లకాల్వలు - పాత అలుగులో లీకేజీలు - చివరి ఆయకట్టుకు అందని సాగునీరు మహబూబ్‌నగర్: ప్రస్తుతం రిజర్వాయర్‌గా ఉపయోగిస్తున్నా.. కనీస మరమ్మతులకు నోచుకోవడం లేదు. నిజాం నవాబుల కాలంలో నిర్మించిన ఈ ప్రాజెక్టు క్రస్టుగేట్ల షట్టర్లకు ఇప్పటివరకూ మరమ్మతులు చేపట్టలేదు. రబ్బర్ వాచర్లు పూర్తిగా అరిగిపోయి పాత అలుగుస్థాయి 26.6 అడుగులకు నీరు చేరగానే లీకేజీలు ప్రారంభమవుతున్నాయి. అధికారులు కొత్తగా రబ్బరు వాచర్లను వేయడంలో శ్రద్ధచూపడం లేదు. గతంలో ఉన్న అధికారులు ఏటా లీకేజీలు అరికట్టడానికి తాత్కలికంగా గోనే సంచులను షట్టర్ల కిందకు జొప్పించేవారు. ప్రస్తుతం అలాంటి చర్యలేవీ తీసుకోవడం లేదు. కోయిల్‌సాగర్ అలుగుపై పిచ్చిమొక్కలు మొలచినా తొలగించడం లేదు. నెరవేరని ఎత్తిపోతల లక్ష్యం వర్షాభావ పరిస్థితుల కారణంగా కోయిల్‌సాగర్‌లోకి పెద్దవాగు నీటి ప్రవాహం లేకపోవడంతో జూరాల బ్యాక్‌వాటర్ నుంచి ఎత్తిపోతల ద్వారా నీటిని పంపింగ్ చేసినా ప్రాజెక్టును పూర్తిస్థాయిలో నింపలేకపోయారు. షట్టర్ లేవల్ 32.6 అడుగులు ఉండగా, అలుగు లెవల్ 26.6 అడుగుల సామర్థ్యం మేరకు నీటిని నింపారు. అయితే గొటుసు కట్టు చెరువులకు నీటిని వదిలి పూర్తిస్థాయిలో నింపలేకపోయారు. దాదాపు రూ.400కోట్లు వెచ్చించి కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పనులు పూర్తిచేసినా ఇతర సమస్యలను గాలికొదిలారు. గతంలో వర్షాధారంగా ప్రాజెక్టు నిండినప్పడు 12వేల ఎకరాలకు సాగునీటిని అందించేవారు. ప్రస్తుతం కృష్ణా జలాలను ఎత్తిపోతల ద్వారా తీసుకురావడం వల్ల ఆయకట్టు 50,250 ఎకరాలకు పెరగాల్సి ఉంది. అయితే ఇప్పటి పరిస్థితుల్లో చివరి ఆయకట్టు భూములకు సాగునీరందని పరిస్థితి నెలకొంది. తూములు లేని కాల్వలు కోయిల్‌సాగర్ కుడి, ఎడమ కాల్వల తూములకు షట్టర్లు లేకపోవడంతో నీరంతా వృథా అవుతుంది. ఇక పిల్లకాల్వల పరిస్థితి కూడా అధ్వానంగా మారింది. కాల్వల ద్వారా పంటపొలాలకు నీరు వదిలితే.. పది అడుగులు కూడా పారడం లేదు. కుడి కాల్వ కింద ధన్వాడ, చిన్నచింతకుంట మండలాలతో పాటు నర్వ మండలంలోని కొంతమేర భూములు సాగవుతాయి, ఎడమ కాల్వ ద్వారా ప్రస్తుతం దేవరకద్ర మండలం గూరకొండ వరకు భూములు సాగవుతుండగా కొత్త ఆయకట్టు కింద కౌకుంట్ల రాజోలి వరకు సాగులోకి వస్తాయి. గొలుసు కట్టు చెరువుల కోసం నీటిని వదలడానికి కొత్త కాల్వలకు తూములు నిర్మించాల్సిన అవసరం ఉంది. ప్రాజెక్టుకు రెండువైపులా ఉన్న ఆనకట్ట ఫుట్‌పాత్‌పై కాంక్రీట్ పనులు చేపట్టాలి. పర్యాటకం కల నెరవేరేనా..? జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న కోయిల్‌సాగర్ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ప్రాజెక్టు నిండినప్పుడు సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. సెలవుదినాల్లో పిల్లలు, పెద్దలు పెద్దఎత్తున ఇక్కడికి వస్తుంటారు. బోటింగ్ వంటి సౌకర్యం, అలాగే అధ్వానస్థితిలో ఉన్న గెస్ట్‌హౌస్‌ను బాగుచేస్తే పర్యాటక శాఖకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. నేడు జిల్లాకు మంత్రి హరీష్‌రావు రాష్ట్ర నీటిపారుదల, మైనింగ్, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని పలు సాగునీటి ప్రాజెక్టులను సందర్శించి పనుల పురోగతిని సమీక్షించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి 8.30 గంటలకు అన్నాసాగర్, 10 గంటలకు కోయిల్‌సాగర్ డ్యామ్‌ను సందర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.30 కోయిలసాగర్ ఎత్తిపోతల పథకం, భూత్పూర్ రిజర్వాయర్‌ను సందర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు అమరచింతకు చేరుకుని ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తారని అధికారులు శుక్రవారం తెలిపారు.