నిజామాబాద్ జిల్లా లింగంపేట మండల కేంద్రంలో తాగునీటి సమస్య తీవ్రమైంది.
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా లింగంపేట మండల కేంద్రంలో తాగునీటి సమస్య తీవ్రమైంది. వేసవి ముంచుకొస్తుండటంతో ప్రజలు ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నాఫలితం లేకుండా పోతోంది. దీంతో ఆగ్రహించిన స్థానికులు సోమవారం ఉదయం ఖాళీ బిందెలతో ఆందోనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. అధికారులు తమ సమస్యను పరిష్కరించేదాకా ఆందోళన విరమించేది లేదని స్తానికులు తెలిపారు.
(లింగంపేట)