దుబ్బాక : ఏడాది నుంచి దోసెడు నీళ్లు రావడం లేదంటూ శనివారం దుబ్బాక నగర పంచాయతీ కార్యాలయం ఎదుట నాల్గొవ వార్డుకు చెందిన మహిళలు ఖాళీ బిందెలతో ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ వార్డులో నీటి గోస ఉందని చాలసార్లు నగర పంచాయతీ కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గల్లీలోకి నీరు రాకున్నా నల్లా బిల్లులు మాత్రం వసూలు చేస్తున్నారని, బిల్లులు చెల్లించని వాళ్లవి నల్లా కనెక్షన్లను తొలగిస్తున్నారని, నీరే సరిగా సరఫరా చేయకున్నా బిల్లులెందుకు వసూలు చేస్తున్నారని నగర పంచాయతీ సిబ్బందిని నిలదీశారు. నల్లాల ద్వారా నీటి సరఫరాను పునరుద్ధరించకుంటే నగర పంచాయతీ కార్యాలయాన్ని దిగ్భందిస్తామని మహిళలు హెచ్చరించారు.