అవకాశం ఇవ్వండి..అన్నీ పరిష్కరిస్తాం
Published Wed, Nov 27 2013 12:01 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
సాక్షి, న్యూఢిల్లీ: పదిహేనే ళ్ల కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన ఢిల్లీవాసులకు డిసెంబర్ 4 తర్వాత విముక్తి కల్పిస్తామని, వారు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతామని ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. ఢిల్లీవాసులను ఆకట్టుకునేలా రూపొందించిన పార్టీ మేనిఫెస్టోను మంగళవారం బీజేపీ ఢిల్లీప్రదే శ్ కార్యాలయంలో విడుదల చేశారు. లోక్‌సభ, రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీతోపాటు బీజేపీ నగరశాఖ అధ్యక్షుడు విజయ్‌గోయల్, సీఎం అభ్యర్థి హర్షవర్ధన్, బీజేపీ ఢిల్లీ ఎన్నికల ఇన్‌చార్జ్ నితిన్‌గడ్కారీ, విజయేంద్రగుప్తా, విజయ్ జోలీ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఢిల్లీలో తాము అధికారంలోకి వస్తే స్థానిక సమస్యలన్నింటికీ పరిష్కారం చూపుతామని బీజేపీ సీఎం అభ్యర్థి హర్షవర్ధన్ పేర్కొన్నారు. గతంలో పేర్కొన్నట్టుగానే విద్యుత్ చార్జీల 30 శాతం తగ్గింపును బీజేపీ ప్రత్యేకంగా ప్రస్తావించింది. మహిళల భద్రత, ఢిల్లీకి ప్రత్యేక రాష్ట్రహోదా, ఆరోగ్యం, అదనపు గ్యాస్ సిలిండర్ల పంపిణీ తదితర అంశాలను ప్రస్తావించారు. ఢిల్లీవాసుల నుంచి సేకరించిన అభిప్రాయాలను కలబోతగా తయారు చేసి, ఎన్నికలకు సరిగ్గా వారం ముందు విడుదల చేసిన పార్టీ మేనిఫెస్టో ఢిల్లీవాసులను ఆకట్టుకుంటుందని బీజేపీ విశ్వసిస్తోంది. ఇదిలా ఉండగా కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ పార్టీలు మేనిఫెస్టో విడుదల చేసిన ఐదురోజుల అనంతరం బీజేపీ మేనిఫెస్టో రావడం గమనార్హం.
బీజేపీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలోని విశేషాలు అంశాల వారీగా:
ఢిల్లీకి పూర్తి రాష్ట్రహోదా:
బీజేపీ అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లోనే ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్రహోదా కోసం కృషి.
ఎన్ సీఆర్ ప్రాంతంలోని ఫరీదాబాద్, గుర్గావ్, సోనిపట్, రోహ్‌తక్, ఇంద్రపురం, ఘజియాబాద్,
నోయిడాలను కలిపేలా రవాణా వ్యవస్థ ఏర్పాటు
ప్రభుత్వ సేవల్లో పారదర్శకత పెంచేందుకు ఈ-గవర్నెన్స్ అమలు.
లోకాయుక్తకు అదనపు అధికారాల క ల్పన
సత్వర న్యాయం:
బాధితులందరికీ సత్వరన్యాయం అందేలా ‘స్పీడీ జస్టిస్ కమిషన్’ ఏర్పాటు.
మహిళలపై జరుగుతున్న లైంగిక దాడుల కేసుల విచారణకు ‘ఫాస్ట్‌ట్రాక్ కోర్టు’ల ఏర్పాటు. వయోధికులు వేసే కేసుల విచారణకు స్పెషల్ కోర్టుల ఏర్పాటు.
1984 అల్లర్ల బాధితుకుల న్యాయం చేసేందుకు ప్రత్యేక చర్యలు.
సబ్సిడీపై అదనపు సిలిండర్లు:
ప్రస్తుతం సబ్సిడీపై ఇస్తున్న తొమ్మిది గ్యాస్ సిలిండర్లకు అదనంగా మూడు కలిపి మొత్తం 12 సిలిండర్లను పంపిణీ చేయడం.
విద్యుత్, మంచినీరు:
విద్యుత్ చార్జీలను 30 శాతం తగ్గించేలా డిస్కమ్‌ల మధ్య పోటీ పెంచడం. వాటి పనితీరును ఆర్‌టీఐ,
కాగ్ పరిధిలోకి తేవడం.
ప్రతి ఇంటినీ విద్యుత్ ఉత్పాదక కేంద్రంగా మార్చేలా ఇళ్లపై సోలార్ విద్యుత్ ఉత్పాదక వ్యవస్థ ఏర్పాటు. సోలార్ విద్యుత్ వ్యవస్థ ఏర్పాటుకు అవసరమయ్యే వస్తువుల తయారీపై పదేళ్ల వరకు పన్నులు
రద్దు చేయడం.
ఢిల్లీవాసులకు సురక్షిత మంచినీటి సరఫరా
డీజేబీ పనితీరు మెరుగుపర్చేందుకు చర్యలు
రవాణా వ్యవస్థ:
మెట్రోరైలు, డీటీసీ బస్సులు, మెట్రోఫీడర్ బస్సుల సంఖ్య పెంచడం.
మెట్రోరైలు,మెట్రోఫీడర్ బస్సులు,డీటీసీ బస్సులకు వర్తించేలా కామన్ స్మార్ట్‌కార్డులను అందుబాటులోకి తేవడం. విద్యార్థులకు రాయితీలపై స్మార్ట్‌కార్డుల పంపిణీ.
మోనోరైలు సేవలు అందుబాటులోకి తేవడంతోపాటు మెట్రోరైలు వ్యవస్థను ఢిల్లీలోని అన్ని ప్రాంతాలకు విస్తరించడం.
పార్కింగ్ సమస్య పరిష్కారానికి మాస్టర్‌ప్లాన్ అమలు. ఢిల్లీలోని విభిన్న ప్రాంతాల్లో భూగ ర్భ మల్టీలెవల్ పార్కింగ్ వ్యవస్థ ఏర్పాటు.
రోగ్య సేవలు:
యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ పథకం అమలులోకి తేవడం.
దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన ‘ఎసెన్షియల్ డ్రగ్ పాలసీ’ని అమలులోకి తేవడం. దీని
ద్వారా ప్రతి డీల్లీవాసికి 25 రకాల అత్యవసర మందులను ఉచితంగా పంపిణీ చేయడం.
అధికారంలోకి వచ్చిన మొదటి రెండేళ్లలో శిశుమరణాల రేటు 28 నుంచి 15కి తగ్గించడం.
అన్ని జిల్లాల్లో ట్రామాకేర్ సెంటర్ల ఏర్పాటు.
మహిళల భద్రతకు:
ఢిల్లీలో మహిళల భద్రత అంశాలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో 24 గంటల
కాల్‌సెంటర్ల ఏర్పాటు.
పనిచేసే మహిళల కోసం మరిన్ని వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లను ప్రారంభించడం.
మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకునేలా పోలీసు వ్యవస్థను పటిష్టపర్చడం.
మహిళల సాధికారికతకు ప్రభుత్వం తరఫున ఆర్థిక ప్రోత్సాహం అందజేయడం.
పట్టణాభివృద్ధికి:
అన్ని అనధికారిక కాలనీలను క్రమబద్ధీకరించడం. మౌలిక వసతుల కల్పన
‘అటల్ బీహారీ వాజ్‌పేయి జన్‌పునరావాస యోజన పథకం’ కింద జుగ్గీజోపిడీల్లోని పేదలకు పక్కా
ఇళ్ల నిర్మాణం.
యువత వ్యవసాయంలోకి వచ్చేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవడం.
న్యూస్ పేపర్ హాకర్లకు ఉచితంగా సైకిళ్లు
ఎంసీడీల పరిధిలోకి బ్యాటరీ రిక్షాలను
పర్యావరణ పరిరక్షణకు:
ఢిల్లీలో వాయు, ధ్వని కాలుష్యాలను అరికట్టేందుకు చర్యలు.
యమునా శుద్ధికి ప్రత్యేకంగా ఢిల్లీ యమునా డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేయడం.
యమునా నదికి ఇరువైపులా ఉన్న ప్రాం తాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడం.
Advertisement
Advertisement