
ఇదే అంశంపై సీఎంవో నుంచి సీఎం కార్యదర్శి రాజమౌళి అనేకసార్లు తనకు ..
సాక్షి, చిత్తూరు : ఫ్యూజన్ రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్‌కు ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు తనపై తీవ్రస్తాయిలో ఒత్తిడి తెచ్చారని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆర్‌కే పురుషోత్తం తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హర్షవర్ధన్‌కు కొన్నేళ్లుగా టీడీపీతో సంబంధముందన్నారు. హర్షవర్ధన్‌కు గాజువాక అసెంబ్లీ సీటు ఇవ్వాలని సీఎం నిర్ణయించారని, అది కుదరకపోవడంతో ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని భావించారని పేర్కొన్నారు. ( వైఎస్ జగన్‌పై జరిగింది ముమ్మాటికీ హత్యాయత్నమే! )
ఇదే అంశంపై సీఎంవో నుంచి సీఎం కార్యదర్శి రాజమౌళి అనేకసార్లు తనకు ఫోన్ చేశారన్నారు. హర్షవర్ధన్‌కు అర్హత లేకపోయినా.. ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష బాధతలు అప్పగించాలని సీఎం ప్రయత్నించారని తెలిపారు. అసోసియేషన్‌తో సంబంధం లేకపోయినా సీఎంతో కలిసి ఒలింపిక్ అసోసియేషన్ కార్యక్రమాల్లో హర్షవర్ధన్ చాలా సార్లు పాల్గొన్నారని పేర్కొన్నారు. (చదవండి: శ్రీనివాస్ ఫ్లాట్‌లోని వేరే గదిలో ఇద్దరమ్మాయిలు! )