'క్రిస్టియన్ మనోభావాలను దెబ్బతీయడమే'
హైదరాబాద్: క్రిస్మస్ రోజన కేంద్రం గుడ్ గవర్నెన్స్ డే జరపడం సముచితం కాదని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ చర్య క్రిస్టియన్ల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా, వారికి అభద్రతను కల్పిచడమే అని ఆయన బుధవారమిక్కడ అన్నారు. వాజ్పేయికి భారతరత్న ఇవ్వటం సంతోషమేనన్నారు.
అయితే బీజేపీ రాజ్యాంగ సెక్యులరిజంకు కట్టుబడకుండా ...లౌకిక తత్వానికి భంగం కల్పించేలా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని రఘువీరా వ్యాఖ్యానించారు. అటువంటి మతవాద ధోరణులపై టీడీపీ ప్రశ్నించటం లేదని ఆయన మండిపడ్డారు. లౌకిక తత్వానికి భంగం కలుగుతున్నా మౌనంగా ఉండటం ప్రమాదకరమేనని రఘువీరా అన్నారు.