జయకు మోదీ అభినందనలు
చెన్నై : అన్నాడీఎంకే అధ్యక్షురాలు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అభినందనలు వెల్లువెత్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ఆమెకు అభినందనలు తెలిపారు. అక్రమాస్తుల కేసులో జయలలితను కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా మోదీ ఫోన్ ద్వారా జయలలితను అభినందించినట్లు అన్నాడీఎంకే సోమవారం ఓ ప్రకటన చేసింది. జయను అభినందనలు తెలిపినవారిలో తమిళనాడు గవర్నర్ రోశయ్య కూడా ఉన్నారు. అలాగే కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్, నజ్మా హెప్తుల్లా కూడా పురచ్చితలైవికి అభినందనలు తెలిపారు. ఇక ఎన్సీపీ నేత శరద్ పవార్, టీఎంసీ నేత జీ.కె.వాసన్, పలువురు పారిశ్రామికవేత్తలతో పాటు తమిళ చలనచిత్ర ప్రముఖులు కూడా జయను గ్రీట్ చేశారు.